telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

మ‌ల‌యాళ మెగాస్టార్ మోహ‌న్ లాల్ బ‌ర్త్‌డే… “దృశ్యం” అఫీషియ‌ల్ ప్ర‌క‌ట‌న

Mohanlal

ఈ రోజు మ‌ల‌యాళ మెగాస్టార్ మోహ‌న్ లాల్ బ‌ర్త్‌డే సంద‌ర్భంగా “దృశ్యం-2″కి సంబంధించి అఫీషియ‌ల్ ప్ర‌క‌ట‌న చేశారు. ఇందుకు సంబంధించి వీడియో విడుద‌ల చేశారు. సీక్వెల్‌లోను మోహ‌న్ లాల్‌, మీనా న‌టించ‌నున్న‌ట్టు ప్ర‌క‌టించారు. పూర్తి వివ‌రాలు అతి త్వ‌ర‌లో వెల్ల‌డి కానున్నాయి. ఇక మోహ‌న్ లాల్ బ‌ర్త్‌డే సంద‌ర్భంగా వెంక‌టేష్ జ‌న్మ‌దిన శుభాకాంక్ష‌లు తెలిపారు. “నా ప్రియమైన స్నేహితుడికి పుట్టినరోజు శుభాకాంక్షలు. అతని పనిని చూసిన తరువాత ఇండ‌స్ట్రీకి దక్కిన గొప్ప వ‌రం అని చేను చెప్ప‌గ‌ల‌ను. వ‌రుస‌ చిత్రాల‌లో అత్యుత్తమ ప్రదర్శనలు ఇచ్చే అద్భుతమైన నటుడు మోహ‌న్ లాల్‌. ఇలాంటి మరిన్ని ప్రదర్శనలతో మీరు మమ్మల్ని అలరించడం కొనసాగించండి సార్” అంటూ త‌న ట్వీట్‌లో పేర్కొన్నారు వెంకీ. ఇక మోహన్ లాల్, మీనా ప్రధాన పాత్రల్లో దర్శకుడు జీతూ జోసెఫ్ రూపొందించిన మలయాళ చిత్రం `దృశ్యం`. కుటుంబ బంధాలు, థ్రిల్లర్ కథాంశంతో రూపొందిన ఈ చిత్రం బ్లాక్ బ‌స్ట‌ర్ విజ‌యం సాధించింది. 2103లో మ‌ల‌యాళంలో విడుద‌లైన ఈ చిత్రాన్ని తెలుగు, తమిళం, కన్నడం, హిందీ, సింహళం మొదలైన భాషల్లో రీమేక్ చేశారు. చైనీస్ భాషలోకి రీమేక్ అయిన తొలి భారతీయ సినిమాగా కూడా నిలిచింది. దృశ్యం చిత్రాన్ని తెలుగులో వెంక‌టేష్ రీమేక్ చేసిన సంగ‌తి తెలిసిందే. ఇక్క‌డ కూడా ఈ చిత్రం మంచి విజ‌యం సాధించింది.

Related posts