telugu navyamedia
ట్రెండింగ్ వార్తలు సాంకేతిక

వయసు ఆరేళ్ళే.. ఆదాయం ఇరవై లక్షలపైనే..

6 years girl earning 21 laksh on youtube

యూ ట్యూబ్ ఛానెల్ అంటే ఎంత హాస్యాస్పదం అయ్యిందో తెలియని విషయం కాదు, ప్రతి ఒక్కరు ఒకటి కంటే ఎక్కువ చాన్నెల్లే పెట్టి అసలు దాని ప్రాధాన్యతనే దారిమళ్లించారు. అయితే కొందరు మాత్రం ఇంకా దాని విలువను కాపాడుతూనే ఉన్నారు. ఇక్కడ ఒక బుడత చేసిన పని ఇప్పుడు వైరల్ అవడం విశేషం. బడిలో చేరాల్సిన వయసులో యూ ట్యూబ్ ఛానల్ పెట్టి నెలకు అక్షరాలా రూ.21 లక్షలు సంపాదిస్తూ అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తుతోందో చిన్నారి. దక్షిణ కొరియాకు చెందిన బోరమ్(అభిమానులు పెట్టిన ముద్దుపేరు) తన పేరు మీద ‘బోరమ్ టాయ్ రివ్యూస్’ అనే యూ ట్యూబ్ ఛానెల్‌ను ప్రారంభించింది.

మార్కెట్‌లో రిలీజ్ అయ్యే ఆట వస్తువులపై రివ్యూలు చేసి తన యూట్యూబ్ ఛానల్‌లో అప్‌లోడ్ చేస్తుంటుంది. ఆమె చేసే రివ్యూలకు ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. ఏకంగా ఆమెకు 13 లక్షల మంది సబ్‌స్కైబర్లు ఉన్నారంటే ఆ యూట్యూబ్ ఛానల్‌కు ఉన్న ఆదరణ ఏపాటిదో అర్థం చేసుకోవచ్చు. ఇంకొక ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే బోరమ్ తన సంపాదనతో రూ.55 కోట్లు పెట్టి ఓ బంగాళాను కొనేసింది. ఈ న్యూస్ దక్షిణ కొరియాలో హాట్ టాపిక్‌గా మారింది.

Related posts