నిన్న మొన్న భారత్ లో కి 5జి మొబైల్స్ వస్తే, తాజాగా 5జి టీవీలు కూడా రాబోతున్నాయి. ఇప్పటికే చైనాకు చెందిన దిగ్గజ స్మార్ట్‌ఫోన్స్ తయారీ కంపెనీ హువావే… స్మార్ట్ టీవీ వ్యాపారంలోకి ఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధమౌతోంది. హువావే అమ్మకాలు 2019 తొలి త్రైమాసికంలో వార్షిక ప్రాతిపదికన 50 శాతం పెరిగాయి. దీని తో యాపిల్ కంపెనీని వెనక్కు నెట్టి ప్రపంచంలోనే రెండో అతిపెద్ద స్మార్ట్‌ఫోన్ తయారీ కంపెనీగా అవతరించింది.
అదిరిపోయే స్మార్ట్ టీవీలను హువావే మార్కెట్‌లోకి తెచ్చేందుకు ప్రయత్నాలు ప్రారంభించినట్లు తెలుస్తోంది. నికాయ్ ఏషియన్ రివ్యూ ఈ విషయాన్ని వెల్లడించింది. దీని ప్రకారం హువావే 5జీ సపోర్ట్ ఫీచర్‌తో… 8కే స్మార్ట్ టీవీని తీసుకురానుంది. కంపెనీ తన మేట్ 20ఎక్స్ 5జీ, ఫోల్డబుల్ మేట్ ఎక్స్ 5జీ స్మార్ట్‌ఫోన్ల మాదిరే ఈ టీవీల్లోనూ 5జీ మాడ్యూల్స్‌ను అమర్చనుంది. హువావే కంపెనీ ప్రపంచంలోని అతిపెద్ద స్మార్ట్‌ఫోన్స్ తయారీ కంపెనీల్లో ఒకటి. అలాగే కమ్యూనికేషన్ ఉపకరణాలను కూడా సరఫరా చేస్తూ ఉంటుంది. దీని తో శాంసంగ్ కంపెనీకి గట్టి పోటీ ఎదురు కానుంది.