telugu navyamedia
సినిమా వార్తలు

59 సంవత్సరాల “వీరాభిమన్యు”

నందమూరి తారకరామారావు గారు నటించిన పౌరాణిక చిత్రం రాజలక్ష్మి ప్రొడక్షన్స్ వారి “వీరాభిమన్యు” 12 ఆగస్టు 1965 విడుదలయ్యింది.

నిర్మాతలు సుందరలాల్ నహతా, డూండీలు రాజలక్ష్మి ప్రొడక్షన్స్ బ్యానర్ పై ప్రఖ్యాత దర్శకుడు వి.మధుసూదనరావు దర్శకత్వం లో ఈ చిత్రాన్ని నిర్మించారు.

ఈ చిత్రానికి మాటలు: సముద్రాల రాఘవాచార్య, పాటలు, పద్యాలు: ఆరుద్ర, ఆత్రేయ, దాశరథి, సముద్రాల రాఘవాచార్య, తిక్కన, సంగీతం: కె.వి.మహదేవన్, ఫోటోగ్రఫీ, ట్రిక్స్: రవికాంత్ నగాయిచ్, కళ: ఎస్.కృష్ణారావు, నృత్యం: పసుమర్తి కృష్ణమూర్తి, ఎడిటింగ్: ఎన్.ఎస్.ప్రకాశం, అందించారు.

ఈచిత్రంలో ఎన్.టి.రామారావు, శోభన్ బాబు,కాంచన, కాంతారావు, జి. వరలక్ష్మి, ఎస్.వరలక్ష్మి, గీతాంజలి, మిక్కిలినేని, రాజనాల, ధూళిపాళ, పద్మనాభం, సత్యనారాయణ, దండమూడి రాజగోపాలరావు, రావి కొండలరావు, నెల్లూరు కాంతారావు, కె.వి.ఎస్.శర్మ, కాకరాల, తదితరులు నటించారు.

ప్రముఖ సంగీత దర్శకుడు కె.వి.మహదేవన్ గారి సంగీత సారధ్యంలో వచ్చిన పాటలన్నీ హిట్ అయ్యాయి.
“రంభా ఊర్వశి తలదన్నే రమణీ లలామ ఎవరీమె”
“అదుగో నవలోకం,వెలిసే మనకోసం”
“చూచీ, వలసీ, చెంతకు పిలిచీ, నీ సొగసులు లాలనచేసి”
“చల్లని సామివి నీవైతే అల్లన ఆగుము జాబిల్లీ”
వంటి పాటలు, పద్యాలు శ్రోతలను ఆకట్టుకున్నాయి.

ఎన్టీఆర్ గారు మంచి ఇమేజ్ లో ఉండి పౌరాణిక చిత్రాలలో అన్నిరకాల పాత్రలు పోషిస్తున్న తరుణంలో సినిమా కు ముఖ్యమైన టైటిల్ కారెక్టర్ అభిమన్యుడు పాత్రను తాను చేయకుండా శోభన్ బాబును ఎంపిక చేసినప్పటికీ ఒక్క శ్రీకృష్ణుడు పాత్రను మాత్రమే పోషించటం ఆయనలోని గోప్పతనానికి, థాతృత్వానికీ నిదర్శనంగా చెప్పవచ్చు.

ఎక్కువగా సాంఘిక సినిమాలకు దర్శకత్వం వహించే మధుసూదనరావు గారు పౌరాణిక చిత్రాలకు కూడా దర్శకత్వం వహిoచ గలరని ఈ సినిమా ద్వారా నిరూపించారు.

ఏవిధమైన గ్రాఫిక్స్ లేని 1960 దశకంలోనే కురుక్షేత్ర సంగ్రామాన్ని ఈ సినిమా లో చాలా గొప్పగా చిత్రీకరించారు.

ఎన్టీఆర్ గారు శ్రీకృష్ణుడు గా ఆయన అభినయం, ఆహార్యం, చిలితనం, రౌద్రం (కౌరవసభలో) వర్ణించనలవికాదు.

ఈ సినిమా క్లయిమాక్స్ సన్నివేశంలో శ్రీకృష్ణుని (ఎన్టీఆర్) విశ్వరూపం ప్రత్యేకంగా రంగులలో చిత్రీకరించారు.

శ్రీకృష్ణుని విశ్వరూపం అన్ని చిత్రాలలో కన్నా భిన్నంగా చాలా గొప్పగా ఎక్కువ సమయం చిత్రీకరించారు.

ఈ చిత్రంలో ప్రధాన పాత్ర అభిమన్యుడు గా శోభన్ బాబు కన్నా ముందు నిర్మాతలు హరినాధ్, రామకృష్ణ
లలో ఎవరినో ఒకరిని ఎంపిక చేయాలని అనుకోగా ఎన్టీఆర్ గారు శోభన్ బాబు పేరును సూచించటంతో
నిర్మాతలు హీరోగా శోభన్ బాబును ఎంపిక చేసారు.

ఈ సినిమాతో శోభన్ బాబు సినీ పరిశ్రమలో నిలదొక్కు కోవటం తో పాటు మంచిపేరు తెచ్చుకున్నారు. ఈ చిత్రం ఘన విజయం సాధించి నిర్మాతలకు ఆర్ధిక విజయాన్ని అందించటంతో పాటు విడుదలైన దాదాపు అన్ని కేంద్రాలలో 50 రోజులు, మొత్తం 13  కేంద్రాలలో 100 రోజులు ప్రదర్శింపబడిoది.

100 రోజులు ఆడిన కేంద్రాలు:-

1)విజయవాడ – మారుతీ (154 రోజులు) ,
2)గుంటూరు – విజయా టాకీస్ (108 రోజులు),
3)తెనాలి– వీనస్ పిక్చర్ ప్యాలెస్(105 రోజులు), 4)రాజమండ్రి – వీరభద్ర పిక్చర్ ప్యాలెస్ (112 రోజులు),
5)భీమవరం – పాండురంగ టాకీస్(100రోజులు) ,
6)కాకినాడ – లక్ష్మి టాకీస్ (105 రోజులు),
7)అమలాపురం — శ్రీనివాస (100రోజులు),
8)విజయనగరం– వెంకటేశ్వర టాకీస్ (105 రోజులు),
9)నెల్లూరు — విజయమహల్ (105 రోజులు) ,
10)తిరుపతి– ఐ.ఎస్.మహల్ (105 రోజులు),
11)హైదరాబాద్–ప్రభాత్(84రోజులు) + రీగల్(షిఫ్ట్),
12)వరంగల్ – రాజ రాజేశ్వరి (112 రోజులు),
13)ఖమ్మం– సుందర్ టాకీస్ (లేట్ రన్-100 రోజులు)

ఈ సినిమాను బెంగాలీ లోకి డబ్బింగ్ చేసి విడుదల చేయగా అక్కడ కూడా 100 రోజులు ఆడింది.

విజయవాడ – మారుతీ టాకీస్ లో మొత్తం154 రోజులు (22 వారాలు) ప్రదర్శింపబడింది….

Related posts