telugu navyamedia
సినిమా వార్తలు

59 సంవత్సరాల “సి.ఐ.డి”

నటరత్న ఎన్.టి.రామారావు గారు నటించిన సాంఘిక చిత్రం విజయా ప్రొడక్షన్స్ వారి “సి.ఐ.డి”                     23-09-1965 విడుదలయ్యింది.

నిర్మాతలు బి.నాగిరెడ్డి-చక్రపాణిలు విజయా ప్రొడక్షన్స్ బ్యానర్ పై ప్రముఖ దర్శకుడు తాపీ చాణక్య గారి దర్శకత్వంలో ఈ చిత్రాన్ని నిర్మించారు.

ఈ చిత్రానికి స్క్రీన్ ప్లే: చక్రపాణి, మాటలు: డి.వి.నరసరాజు, పాటలు: పింగళి నాగేంద్రరావు, పట్నం సుబ్రహ్మణ్య అయ్యర్, సంగీతం: ఘంటసాల, ఛాయా గ్రహణం: మాధవ బుల్ బులే, కళ: కృష్ణారావు, నృత్యం: వెంపటి చిన సత్యం, ఎడిటింగ్: జి.కల్యాణసుందరం, అందించారు.

ఈ చిత్రంలో ఎన్.టి. రామారావు, జమున, గుమ్మడి , పండరీబాయి, మిక్కిలినేని, రాజనాల,హేమలత,
మీనాకుమారి, రమణారెడ్డి, రావి కొండలరావు, నల్ల రామమూర్తి, జగ్గారావు, తదితరులు నటించారు.

మధుర గాయకులు, ప్రఖ్యాత సంగీత దర్శకులు ఘంటసాల గారి సంగీత సారధ్యంలో వచ్చిన పాటలు హిట్ అయ్యాయి.
“ఎందుకనో నిను చూడగనే కవ్వించాలని వుంటుంది”,
“యువతులు చూసీ చూడకముందే ఐసౌవుతాయా అబ్బాయి”,
“నా సరి నీవని నీ గురి నేనని ఇపుడే తెలిసెనులే”
వంటి పాటలు శ్రోతలను ఆకట్టుకున్నాయి.

సరికొత్త టెక్నాలజీని ఉపయోగించి డిటెక్టివ్ తరహాలో ఆద్యంతం ఆసక్తిదాయకంగా ఈ చిత్రాన్ని రూపొందించారు.

విజయాసంస్థ నిర్మించిన సినిమాలలో C.I.D అంటూ ఇంగ్లీష్ టైటిల్ పెట్టిన చిత్రం ఇదే.

ఈ చిత్రం విజయవంతమై పలు కేంద్రాలలో 50 రోజులు, ఒక కేంద్రం లో శతదినోత్సవం జరుపుకున్నది.
విజయవాడ – దుర్గా కళామందిర్-(105 రోజులు) ప్రదర్శింపబడింది..

Related posts