విశ్వవిఖ్యాత నటసార్వభౌమ ఎన్. టి.రామారావు గారు నటించిన సాంఘిక చిత్రం శ్రీ గౌతమి పిక్చర్స్ వారి
“వాడే వీడు” 18-10-1973 విడుదలయ్యింది.
నిర్మాత ఎన్. రామబ్రహ్మం గారు శ్రీ గౌతమి పిక్చర్స్ బ్యానర్ పై ప్రముఖ దర్శకుడు డి.యోగానంద్ గారి దర్శకత్వంలో ఈ చిత్రాన్ని నిర్మించారు.
ఈ చిత్రానికి కథ, మాటలు, స్క్రీన్ ప్లే: డి.వి.నరసరాజు, పాటలు: దేవులపల్లికృష్ణశాస్త్రి, సి.నారాయణరెడ్డి, కొసరాజు, దాశరథి, సంగీతం: సత్యం, డైరెక్టర్ ఆఫ్ ఫోటోగ్రఫీ: ఎస్.ఎస్.లాల్, కళ: ఎస్.కృష్ణారావు, నృత్యం: చిన్ని,సంపత్, ఎడిటింగ్: బి.కందస్వామి అందించారు.
ఈ చిత్రంలో ఎన్.టి. రామారావు, మంజుల, నాగభూషణం, కృష్ణంరాజు, లీలారాణి, అల్లు రామలింగయ్య, హేమలత, పండరీబాయి,మిక్కిలినేని, పద్మనాభం, చలపతిరావు, సంధ్యారాణి, నాగరత్నం
తదితరులు నటించారు.
ప్రఖ్యాత సంగీత దర్శకుడు సత్యం గారి స్వరకల్పనలో వచ్చిన పాటలు హిట్ అయ్యాయి.
“అటు చల్లని వెలుగుల జాబిలి, ఇటు వెచ్చని చూపుల కోమలి”,
“చీర లేని చిన్నదానా ,ఓ యబ్బ చిగురాకు వన్నెదాన”,
“వయసే ఒక పాఠం,వలపే ఒక పాఠం,గురువు చెప్పనది”
“లవ్ లోనే ఉందిలే లోకమంతా, అది లేకపోతే చీకటిలే జీవితమంతా”
వంటి పాటలు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.
ఈ చిత్రం ద్వారా హీరోయిన్ మంజుల తొలిసారిగా ఎన్టీఆర్ గారి కి జతగా నటించింది.
ఈ చిత్రం పలు కేంద్రాలలో 50 రోజులు, విజయవాడ – లక్ష్మీ టాకీస్ తో పాటు మరి కొన్ని కేంద్రాలలో షిఫ్ట్ పై 100 రోజులు ప్రదర్శింపబడి శతదినోత్సవాలు జరుపుకున్నది…