telugu navyamedia
వార్తలు వ్యాపార వార్తలు

5 రోజులే పనిదినాలని ఆదేశాలివ్వలేదు: ఆర్ బీ ఐ

RBI

వాణిజ్య బ్యాంకులకు వారంలో 5 రోజులే పని దినాలంటూ ఎలాంటి ఆదేశాలు జారీ చేయలేదని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా స్పష్టం చేసింది. వాణిజ్య బ్యాంక్ లు వారంలో అయిదు రోజులు మాత్రమే పని చేయాలని ఆర్ బీ ఐ ఆదేశాలిచ్చినట్టు కొన్ని ప్రసార మాధ్యమాల్లో వస్తున్న వార్తలు అవాస్తమని ఓ ప్రకటనలో తెలిపింది. ప్రస్తుతం వాణిజ్య బ్యాంకులకు ఆదివారాలతో పాటు రెండవ, నాల్గవ శనివారాలు మాత్రమే సెలవు ఉన్న సంగతి తెలిసిందే. మిగిలిన శనివారాల్లో రోజువారీ సమయ వేళల ప్రకారమే యధావిధిగా కార్యకలాపాలు నిర్వహిస్తున్నాయి.

Related posts