telugu navyamedia
సినిమా వార్తలు

44 సంవత్సరాల “సూపర్ మేన్”

నటరత్న, పద్మశ్రీ ఎన్.టి.రామారావు గారు నటించిన సాంఘిక చిత్రం లక్ష్మీ విష్ణు ప్రొడక్షన్స్ “సూపర్ మేన్” సినిమా 10-07-1980 విడుదలయ్యింది.

నిర్మాత ఆర్.గోపాల్ లక్ష్మీ విష్ణు ప్రొడక్షన్స్ బ్యానర్ పై ప్రముఖ దర్శకుడు వి. మధుసూదనరావు గారి దర్శకత్వంలో ఈ చిత్రాన్ని నిర్మించారు.

ఈ చిత్రానికి కథ: ఆర్.కె.ధర్మరాజు, స్క్రీన్ ప్లే: వి. మధుసూదనరావు, మాటలు, పాటలు: ఆచార్య ఆత్రేయ, సంగీతం: చక్రవర్తి, ఫోటోగ్రఫీ: కె.ఎస్.ప్రసాద్, ట్రిక్ ఫోటోగ్రఫీ: మార్కెస్ బార్ట్లే, కళ: ఎస్.కృష్ణా రావు,
నృత్యం: సలీం, ఎడిటింగ్: వెంకటరత్నం అందించారు.

ఈచిత్రంలో ఎన్.టి.రామారావు, జయప్రద, గీత, సత్యనారాయణ, ప్రభాకరరెడ్డి, పండరిబాయ్, అన్నపూర్ణ, జయమాలిని, రావికొండలరావు, సిలోన్ మనోహర్, త్యాగరాజు, అర్జా జనార్ధనరావు, మాస్టర్ రాజు, చక్రపాణి తదితరులు నటించారు.

సంగీత దర్శకుడు స్వర చక్రవవర్తి గారి స్వరకల్పనలో పాటలన్నీ హిట్ అయ్యాయి.
“శ్రీ ఆంజనేయ.. ప్రసన్నాoజనేయ..”
“మబ్బుల్లో చంద్రమ్మ…చంద్రమ్మా..”
“అది గదిగదిగద్గో అట్టా సూడమాక”
“చినుకు చిటుకేసిందీ, చూపు చురకేసిందీ”
“సూపర్ మేన్,మేన్,మేన్…మబ్బుల్లో చంద్రమ్మా”
“కన్ను కొట్టెయ్యనా,నిన్ను కట్టెయ్యనా”
వంటి పాటలు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.

ఈ చిత్రంలోని కొన్ని సన్నివేశాలు, పాటలు విదేశాలలో చిత్రీకరించారు. ఈ చిత్రం మొదటి వారం 41 కేంద్రాలలో 24,77,860 రూపాయలు వసూలు చేసి రికార్డు సృష్టించింది.

ఈ చిత్రం విజయం సాధించి పలు కేంద్రాలలో 50 రోజులు, మూడు కేంద్రాలలో (విజయవాడ, గుంటూరు, భీమవరం) 100 రోజులు ప్రదర్శింపబడింది.

Related posts