భారత చరిత్రలో ఎమర్జెన్సీ విధించడం ఓ చీకటి అధ్యాయం. 1975లో జూన్ 25న ఎమర్జెన్సీ ప్రకటించి నేటికి 44 సంవత్సరాలైంది. 44 ఏళ్ల కిందట సరిగ్గా ఇదే రోజున సమాజంలో పౌర, రాజకీయ అశాంతిని కారణాలు చూపుతూ అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ ఎమర్జెన్సీని ప్రకటించారు. ప్రధాని ఇందిరా సలహా మేరకు అప్పటి రాష్ట్రపతి ఫక్రుద్దీన్ అలీ అహ్మెద్ 1975లో జూన్ 25 రాత్రి 11-45 నిమిషములకు ఎమర్జెన్సీ విధించారు.
ఆ ప్రకటన వెలువడగానే పెద్దసంఖ్యలో విపక్ష నేతలు, సామాజిక కార్యకర్తలను జైళ్లలో నిర్బంధించారు. . మీడియాపై అణిచివేత వైఖరి ప్రదర్శించారు. బలవంతంగా కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు జరిగాయి. 1977 మార్చ్ 21న ఎమర్జెన్సీ కాలం ముగిసే వరకు ఎన్నో హింసాత్మక ఘటనలు జరిగాయి.
సంయమనంతో మాట్లాడాలి.. బొత్సకు పవన్ హితవు