4 soldiers killed 3 injured in india border

విరమణ ఒప్పందం పేరుతో కాల్పులు…నలుగురు జవాన్ల మృతి…

25

జమ్మూ కాశ్మీర్ లో మరోసారి పాక్ తన బుద్దిని చూపించుకుంది. కాల్పుల విరమణ ఒప్పందానికి తూట్లు పొడుస్తూ కాల్పులకు ఎగబడింది. బార్డర్ లో భారత సైనికులే లక్ష్యంగా పాకిస్థాన్ విరుచుకుపడింది. కాల్పుల విరమణ ఒప్పందానికి కట్టుబడి ఉంటామని చెప్పి పదిరోజులు గడవకముందే ఈ దుశ్చర్యకు పాల్పడింది. ఈ దాడిలో నలుగురు భారత జవాన్లు మరణించగా, మరో ముగ్గురు బి.ఎస్.ఎఫ్ జవాన్లకు తీవ్ర గాయాలయ్యాయి.

సాంబా జిల్లా చంబ్లియాల్ సెక్టార్ లో ఈ సంఘటన జరిగింది. కొద్దీ రోజుల క్రితమే అధికారులు ఫ్లాగ్ మీటింగ్ ఏర్పాటు చేసుకున్నారు, సమావేశంలో బార్డర్ వెంబడి కాల్పులు జరపకూడదని ఒప్పందం కుదుర్చుకున్నారు. కానీ పాకిస్థాన్ తోక వంకర అనే సామెతకు మేమె ఆదర్శం అన్నట్లు నిరూపించుకుంది. బార్డర్ లో గస్తీ కాస్తున్న భారత జవాన్లను దారుణంగా కాల్చి చంపారు, ఎలాంటి ముందస్తు హెచ్చరికలు లేకుండా, దొంగచాటుగా కాల్పులకు ఒడిగట్టింది.

ఒకవైపు ఉగ్రవాదులను భారత్ కు పంపిస్తూ మరోవైపు సైన్యం పై కాల్పులకు పాల్పడటం ఏమాత్రం మంచిది కాదని, రంజాన్ మాసం కావడంతో భారత సైన్యం వెనక్కి తగ్గింది. భద్రతా అధికారులు కూడా ఎలాంటి ఆపరేషన్ లను చేపట్టడం లేదు కానీ పాకిస్తాన్ వీటిని ఆసరా చేసుకొని తన వక్ర బుద్దిని చూపిస్తుంది.