telugu navyamedia
ట్రెండింగ్ వార్తలు

ఒకే ఆసుపత్రిలో 37 మంది వైద్యులకు కరోనా పాజిటివ్

doctor medical

చైనా నుండి వచ్చిన కరోనా ప్రపంచం మొత్తని అతలాకుతల చేసిన విషయం తెలిసిందే. అయితే ఈ వైరస్ దేశంలో కరోనా అల్లకల్లోలం సృష్టిస్తోంది. రోజురోజుకు దేశంలో కరోనా కేసులు వేల సంఖ్యలో పెరుగుతూనే ఉన్నాయి. ఇప్పటికే ఎందరో రాజకీయ నాయకులు కరోనా బారిన పడ్డారు. ఇక దేశంలో 1.29 కోట్లు దాటాయి కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య. గడచిన 24 గంటలలో 1,26,789 కరోనా పాజిటివ్ కేసులు నమోదవగా… కరోనా వల్ల మొత్తం 685 మంది మృతి చెందారు. ఇక గడచిన 24 గంటలలో దేశ వ్యాప్తంగా 59,258 డిశ్ఛార్జ్ అయ్యారు. దేశంలో ఇప్పటివరకు నమోదయిన కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 1,29,28,574 కాగా.. దేశ వ్యాప్తంగా యాక్టీవ్ కేసులు 9,10,319 గా ఉన్నాయి.   అయితే.. తాజాగా ఢిల్లీలోని “సర్ గంగారాం” ఆస్పత్రిలో 37 మంది వైద్యులకు “కోవిడ్-19” పాజిటివ్ నిర్ధారణ అయింది. ప్రస్తుతం వారిలో 32 మంది వైద్యులు హోం ఐసోలేషన్ లో ఉన్నారు. మిగతా ఐదుగురు వైద్యులు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. అయితే… “కరోనా” సోకిన వైద్యుల్లో అత్యధికులు రెండు సార్లు “వ్యాక్సిన్ డోసు” తీసుకున్నవారే కావడం విశేషం. ఈ ఘటనతో మిగతా వ్యైద్యుల్లోనూ ఆందోళన మొదలైంది.

Related posts