telugu navyamedia
రాజకీయ

దేశంలో కొత్తగా 31,923కరోనా కేసులు

దేశంలో గడిచిన 24 గంటల వ్యవధిలో 15,27,443 మందికి కొవిడ్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా.. 31,923 మందికి వైరస్ పాజిటివ్‌గా తేలింది. ముందురోజుతో పోల్చితే కొత్త కేసులు 18 శాతం మేర పెరిగాయి. ఒక్క కేరళలోనే 19,675 కేసులు నమోదు కావడం ఆందోళన కలిగిస్తోంది. మహారాష్ట్రలో 3 వేల మందికి వైరస్ సోకింది. నిన్న మరో 282 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇదే సమయలో 31,990 మంది కోవిడ్‌ బాధితులు పూర్తిస్థాయిలో కోలుకున్నట్టు బులెటిన్‌లో పేర్కొంది ప్రభుత్వం.

దేశంలో ఇప్పటివరకు 3.35 కోట్ల మందికి కరోనా సోకగా… 3.28 కోట్ల మంది కోలుకున్నారు. ప్రస్తుతం 3,01,640 మంది వైరస్‌ కారణంగా చికిత్స పొందుతున్నారు. ఇక 4,46,050 మంది మృత్యుఒడికి చేరుకున్నారు. క్రియాశీల కేసులు రేటు 0.90 శాతం, రికవరీ రేటు 97.77 శాతం ఉన్నాయి. 83 కోట్ల టీకా డోసులు పంపిణీ.. దేశంలో కరోనా టీకా కార్యక్రమం ఆశాజనకంగా ఉంది. నిన్న 71.38 లక్షల మంది టీకాలు తీసుకున్నారు. మొత్తంగా 83.39 కోట్ల డోసులు పంపిణీ అయ్యాయి.

Related posts