telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

వర్మ ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ నుండి మరో ట్రైలర్ .. మహిళా దినోత్సవ సందర్భంగా.. !

ditributers req for varmas lakshmis ntr

రామ్ గోపాల్ వర్మ, స్త్రీలందరికీ తమ తోటి స్త్రీకి జరిగిన అతి ఘోరమైన హృదయ విధారకమయిన అన్యాయాన్ని చూపించడమే ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ ఉద్ధేశ్యం అని అంటున్నాడు. లక్ష్మీ పార్వతి దృష్టి కోణం నుండి ఎన్టీఆర్ బయోపిక్‌ని తెరకెక్కిస్తున్న వర్మ చిత్రానికి సంబంధించిన ప్రమోషన్ కార్యక్రమాలని వేగవంతం చేశాడు. ఆ మధ్య ఓ ట్రైలర్ విడుదల చేసి సంచలనాలు సృష్టించిన వర్మ తాజాగా మరో ట్రైలర్ విడుదల చేశారు.

వాడు నా పిల్లలు కలిసి నన్ను చంపేశారు అనే క్యాప్షన్‌తో ఈ ట్రైలర్ మొదలు అయింది. లక్ష్మీ పార్వతిని ఎన్టీఆర్ కుటుంబ సభ్యులు దూషించడం, పార్టీని తమ చేతిలోకి లాక్కునేందుకు ప్రణాళికలు వేయడం వంటి అంశాలని ట్రైలర్‌లో చూపించారు. ఈ ట్రైలర్ అభిమానులని ఎంతగానో ఆకట్టుకుంటుంది. మే 22న చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తెచ్చేందుకు ప్లాన్ చేస్తున్నారు వర్మ. యజ్ఞాశెట్టి ‘లక్ష్మీపార్వతి’ పాత్రలో నటిస్తోండగా, ఎన్టీఆర్ పాత్రలో పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన ఓ రంగస్థల కళాకారుడు పీ విజయ్ కుమార్ నటిస్తున్నాడు . ఇక చంద్రబాబు పాత్రలో వంగవీటి సినిమాలో దేవినేని నెహ్రూగా నటించిన శ్రీతేజ్ నటిస్తున్నారు.

Related posts