నేడు జరుగుతున్న రెండో దశ పోలింగ్‌కు సర్వం సిద్ధమైంది. దేశంలోని 11 రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతంలో ఉన్న 95 నియోజకవర్గాల నుంచి బరిలో నిలిచిన 1,611 మంది అభ్యర్థుల భవితవ్యం గురువారం ఈవీఎంలలో నిక్షిప్తమవనుంది. వాస్తవానికి రెండో దశలో భాగంగా 97 నియోజకవర్గాల్లో పోలింగ్ జరగాల్సి ఉంది.
తమిళనాడులోని వేలూరు నియోజకవర్గం ఎన్నిక రద్దవడం, త్రిపురలోని త్రిపుర-తూర్పు లోక్‌సభ స్థానం ఎన్నిక మూడో దశకు (ఏప్రిల్-23కు) వాయిదా పడడంతో రెండు స్థానాలు తగ్గాయి. ఒడిశాలో 35 శాసనసభ స్థానాలకు, తమిళనాడులో ఖాళీగా ఉన్నవాటిలో 18 శాసనసభ స్థానాలకూ, పుదుచ్చేరిలో ఒక శాసనసభ స్థానానికి నేడు పోలింగ్ జరగనుంది.
కేంద్ర మంత్రులు జితేంద్రసింగ్, జ్యుయల్ ఓరం, సదానందగౌడ, పొన్ రాధాకృష్ణన్, మాజీ ప్రధానమంత్రి దేవేగౌడ, డీఎంకే నేతలు దయానిధి మారన్, ఎ.రాజా, కనిమొళి తదితరులు రెండో దశలో బరిలో నిలిచిన ప్రముఖుల్లో ఉన్నారు.
రాజకీయాల్లోకి మాస్ లీడర్లను తీసుకొస్తా: పవన్ కల్యాణ్