telugu navyamedia
రాజకీయ వార్తలు

అఫ్గానిస్తాన్‌ : .. మసీదులో బాంబు పేలుడు ఘటన.. 28మృతి, 55మందికి గాయాలు..

28 died in afghanistan masjid blast

నేడు తూర్పు అఫ్గానిస్తాన్‌లోని ఒక మసీదులో ప్రార్థనల సమయంలో భారీ పేలుడు సంభవించింది. ఈ పేలుడులో దాదాపు 28 మంది మృతి చెందగా 55 మంది గాయపడినట్లు అఫ్గాన్‌ తూర్పు ప్రావిన్స్‌లోని నంగర్‌హర్‌ ప్రావిన్స్‌ గవర్నర్‌ అతౌలా హోగ్యానీ వెల్లడించారు. అఫ్గానిస్తాన్‌లో హింస తారస్థాయికి చేరిందని.. జులై నుంచి సెప్టెంబర్‌ మధ్య కాలంలో ఎంతో మంది సామాన్య ప్రజలు మరణించారని ఐక్యరాజ్య సమితి ప్రకటించిన మరుసటి రోజే ఈ పేలుడు సంభవించడం గమనార్హం. గాయపడిన వారిని హస్కా మినా ప్రాంతంలోని ఓ ఆస్పత్రికి తరలించారు.

పేలుడు జరిగిన నంగర్‌హర్‌ ప్రావిన్స్‌లో తాలిబన్‌, ఇస్లామిక్‌ స్టేట్ గ్రూప్‌ రెండు సంస్థలు కార్యకలాపాలు నిర్వహిస్తున్నప్పటికీ ఈ పేలుడుకు బాధ్యత వహిస్తూ ఏ సంస్థ ప్రకటన చేయలేదు. ఈ ఏడాది జులై నుంచి సెప్టెంబర్‌ మధ్యలో అఫ్గాన్‌లో 1,174 మంది చనిపోగా, 3,139 మంది గాయపడ్డారు. గత ఏడాది ఇదే కాలంతో పోల్చితే ఇది 42 శాతం ఎక్కువని ఐక్యరాజ్య సమితి ఓ నివేదికలో పేర్కొంది.

Related posts