telugu navyamedia
ట్రెండింగ్ వార్తలు

బీఎస్ఎన్ఎల్ నుండి .. భారీగా ఉద్యోగ విరమణలు..

bsnl monsoon offers for prepaid customers

భారత్ సంచార్ నిగం లిమిటెడ్ లో 22 వేల మంది ఉద్యోగులు స్వచ్ఛంద పదవీ విరమణ(వీఆర్‌ఎస్) చేయనున్నారు. మరో రెండు రోజుల్లో ఇందుకు సంబంధించిన ప్రక్రియ జరగనుంది. బీఎస్ఎన్ఎల్ ఉన్నతాధికారి ఒకరు ఈ విషయాన్ని వెల్లడించారు. బీఎస్ఎన్ఎల్‌లో మొత్తం 1.50 లక్షల మంది ఉద్యోగులుండగా… వీరిలో లక్ష మంది ఉద్యోగులు వీఆర్ఎస్‌కు అర్హులు. ఈ నెల ఐదవ తేదీన బీఎస్ఎన్ఎల్ వీఆర్ఎస్ సదుపాయాన్ని అమల్లోకి తెచ్చిన విషయం విదితమే. డిసెంబరు మూడవ తేదీ వరకు వీఆర్‌ఎస్ కు దరఖాస్తు చేసుకోవచ్చు. వాస్తవానికి 77 వేల మంది ఉద్యోగులు వీఆర్ఎస్‌కు దరఖాస్తు చేసుకోవచ్చని సంస్థ ఆవిస్తున్నట్లు ఉన్నతాధికారి ఒకరు పేర్కొన్నారు.

వీఆర్ఎస్‌కు అర్హులైన వారిలో 13 వేల మంది ఉద్యోగులు గ్రూప్ సీ కేటగరీకి చెందిన వారు. మొత్తం ‘వీఆర్ఎస్’కు స్పందన సంతృప్తికరంగా ఉందని బీఎస్ఎన్ఎల్ ఉన్నతాధికారులు భావిస్తున్నారు. మొత్తంమీద వీఆర్ఎస్‌కు 70,000-80,000 మంది ఉద్యోగులు వీఆర్ఎస్‌కు మొగ్గు చూపినపక్షంలో వేతనాల రూపంలో రూ. 7 వేల కోట్ల మేరకు ఆదా చేసుకోవాలని బీఎస్ఎన్ఎల్ భావిస్తోంది. యాభై సంవత్సరాల వయస్సు పైబడి ఉద్యోగుల వీఆర్ఎస్‌కు ఆమోదముద్ర వేయాలని బీఎస్ఎన్ఎల్ నిర్ణయించింది. కాగా వీఆర్ఎస్‌కు ఆమోదం లభించినపక్షంలో… సదరు కార్మికుడిని అతను చేసిన సర్వీసులో ప్రతీ సంవత్సరానికి 35 రోజుల వేతనాన్ని, మిగిలిపోయిన సర్వీసులో సంవత్సరానికి 25 రోజుల వేతనం చొప్పున పరిహారంగా అందిస్తారు.

Related posts