21-people-sexually-assaulted-by-girl

బాలికపై లైంగిక దాడికి పాల్పడ్డ 21 మంది…

20

తమిళనాడు రాజధాని చెన్నై సమీపాన ఉన్న తిరువళ్లూరు అనే గ్రామంలో అత్యంత గోరమైన సంఘటన చోటు చేసునుకుంది, ఏకంగా 21 మంది ఒక బాలికపై సామూహిక హత్యాచారానికి పాల్పడ్డారు. ఈ ఘటన స్థానికుల గుండెల్లో కలకలం లేపుతుంది.

వివరాల ప్రకారం తిరువళ్లూరులోని ఓ ప్రాంతంలో కూలి పని చేసి పొట్ట నింపుకుంటున్న బాధితురాలి తల్లి దండ్రులు ఆ అమ్మాయిని కష్టపడి చదివిస్తున్నారు. పేదరికం కారణంగా ఆ అమ్మాయి మధ్యలోనే చదువును ఆపేసి ఇంటిపనులు చేస్తూ తల్లిదండ్రులకు చేదోడు వాదోడుగా ఉంటూ ఇంట్లో చదువుకుంటుంది. అదే క్రమంలో తనతో పటు చదువుతున్న ఒక వ్యక్తిని ఆమె ప్రేమించింది. అయితే ఆ వ్యక్తి బాధితురాలిని కేవలం సెక్స్ కోసమే ప్రేమించాడట, పలు చోట్లకు తీసుకువెళ్లి ఆమెకు మద్యం, గంజాయి కి వ్యసనం అయ్యేలా చేశాడు.

21-people-sexually-assaulted-by-girl in tamilnadu

ఈ నేపథ్యంలోనే మే 5న బాధితురాలు కనిపించడం లేదని అన్ని చోట్ల వెతికి పోలీసులకు పిర్యాదు చేశామని కుమార్తె అదృశ్యమైంది తల్లిదండులు వాపోతున్నారు. అయితే ఆమెను బస్టాండ్ సమీపంలో అపస్మారక స్థితిలో గుర్తించి చికిత్స చేయించారు. చికిత్స అనంతరం ఆమెను పోలీస్ స్టేషన్ కు తరలించి విచారించగా తనను ఒక గదిలో బందించి మత్తు ఇచ్చి ప్రేమికుడితో పాటు తోటి విద్యార్థులు దాదాపు 21 మంది హత్యాచారానికి పాల్పడ్డారని తెలిపింది. విచారణ జరిపిన పోలీసులు కేసు నమోదు కేసు నమోదు చేసుకొని ఆరుగురు విద్యార్థులను అరెస్ట్ చేసి విచారిస్తున్నారు, మిగిలిన వారికోసం గాలింపు చర్యలు చేపడుతున్నారు.

ఇంకెన్నాళ్లు ఇలా బాలికలపై అత్యాచారాలు, చిన్న పిల్లల నుంచి పెద్ద వారి వరకు కామం మత్తులో కూరుకుపోయి వావి వరసలు లేకుండా, చిన్న పెద్ద తేడా తెలియకుండా మద్యానికి బానిసలుగా మారి అత్యాచారాలకు పాల్పడుతూ జీవితాలను నాశనం చేస్తున్న వారు ఇంకెన్నడు మారుతారని వీరికి ఎలాంటి శిక్ష విధించిన పాపం లేదని మహిళా సంఘాల వారు తెలుపుతున్నారు.