telugu navyamedia
సినిమా వార్తలు

సింగపూర్ లో అతిలోక సుందరి శ్రీదేవి మైనపు విగ్రహావిష్కరణ

Sridevi

ప్రతిష్ఠాత్మక మేడమ్‌ టుస్సాడ్స్ సంస్థ ప‌లువురి సెల‌బ్రిటీల మైన‌పు విగ్ర‌హాల‌ని త‌యారు చేసి ప్ర‌జ‌ల సంద‌ర్శ‌నార్ధం సింగ‌పూర్‌లోని మ్యూజియంలో ఉంచుతున్న సంగ‌తి తెలిసిందే. తాజాగా అతిలోక సుంద‌రి శ్రీదేవి మైన‌పు విగ్ర‌హాన్ని సింగ‌పూర్‌లోని మేడ‌మ్ టుస్సాడ్స్‌లో ఉంచేందుకు నిర్వాహ‌కులు స‌న్నాహాలు చేస్తున్నారు. సెప్టెంబ‌ర్ 4 ఉద‌యం శ్రీదేవి మైన‌పు విగ్ర‌హాన్ని ఆవిష్క‌రించ‌నున్న‌ట్టు టుస్సాడ్స్ సంస్థ త‌మ ట్విట్ట‌ర్ ద్వారా తెలిపింది. ఈ కార్య‌క్ర‌మం ఫేస్ బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ల‌లో ప్ర‌సారం కానుంది. ఇక శ్రీదేవి జ‌యంతి సంద‌ర్భంగా ప్రముఖ పబ్లిషర్స్‌ పెంగ్విన్‌ రాండమ్‌ హౌస్‌ ఇండియా శ్రీదేవి జీవిత చరిత్రను పుస్తక రూపంలో రిలీజ్ చేస్తున్నట్టుగా ప్రకటించారు. ఇందుకు ఆమె భ‌ర్త బోనికపూర్‌ అనుమతి కూడా తీసుకున్నట్టు కూడా తెలిపారు. ‘శ్రీదేవి : గర్ల్‌ ఉమెన్‌ సూపర్‌ స్టార్‌’ పేరుతో రూపొందుతున్న ఈ పుస్తకాన్ని ప్రముఖ రచయిత సత్యార్థ నాయక్‌ రాస్తున్నారు. ఈ పుస్త‌కం అతి త్వ‌ర‌లోనే మ‌న ముందుకు రానుంది. వెండితెర అస‌మాన న‌టి శ్రీదేవి బోనికపూర్ సోదరి రీనా కుమారుడు మోహిత్ మార్వా పెళ్ళిక‌ని దుబాయ్ వెళ్లిన శ్రీదేవి ఫిబ్ర‌వ‌రి 24, 2018న బాత్ ట‌బ్‌లో మునిగి క‌న్ను మూసిన సంగ‌తి తెలిసిందే.

Related posts