19 century photography specialist2

ఆ వయస్సులో కూడా…ఫోటోగ్రఫీ లో…

53

జూలియా మార్గరెట్ కామెరాన్ ఒక ప్రముఖ బ్రిటిష్ ఫోటోగ్రాఫర్. ఆ కాలంలో సెలబ్రిటీస్ ఫొటోస్, పోర్ట్ రైట్స్ మరియు హీరోయిన్ థీమ్స్ లాంటివి తీయటంలో ఆమెది అందెవేసిన చెయ్యి అంటే అతిశయోక్తి కాదు.

19 century photography specialist2

11 ఏళ్ళు(1864-1875) కామెరాన్ ఫోటోగ్రాఫర్ గా పనిచేశారు. ఆమె ఫోటోగ్రఫీ ని 48 ఏళ్ళ వయసులో ప్రారంభించారు. ఫోటోగ్రఫీలో ఆమె శైలిని అందరు గుర్తించకపోయినా తనదైన గుర్తింపును పొందింది.

జూలియా మార్గరెట్ కామెరాన్ అడెలైన్ మారీ డే ఐటంగ్ మరియు జేమ్స్ పీటర్ పాట్లే కు కలకత్తా, బ్రిటిష్ ఇండియా లో జన్మించారు. ఆమె జూన్ 11, 1815 న జన్మించారు. తండ్రి బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీలో అధికారిగా ఉండేవారు.

19 century photography specialist2

కామెరాన్ ఫ్రాన్స్ లో తన విద్యాబ్యాసాన్నిపూర్తిచేశారు. అక్కడినుండి 1838 లో ఇండియా కి వచ్చి జర్నలిస్ట్ చార్లెస్ హే కామెరాన్ ను వివాహం చేసుకున్నారు. వీరికి ఐదుగురు సంతానం, ఈ పిల్లలతో పాటు మరో ఐరిష్ పాప మేరీ రియాన్ ను దత్తత కూడా తీసుకున్నారు. మేరీ ని తన ఫొటోగ్రఫీకి మోడల్ గా కూడా చేశారు.

19 century photography specialist2

1848లో చార్లెస్ రిటైర్మెంట్ తీసుకోగా, కుటుంబం అంతా లండన్ కు మారింది. కామెరాన్ సోదరి సారా ప్రిన్సెప్ సాయంతో లండన్ లో ఓ సెలూన్ ను అద్దెకు తీసుకున్నారు. ఈ ప్రదేశం లిటిల్ హాలండ్ హౌస్ ఇన్ కెన్సింగ్టన్ కావటం అక్కడకు తరచుగా ప్రముఖ రచయితలు, నటులు రావటం తో ఆ ప్రభావం జూలియా పై పడింది.

19 century photography specialist2

1860 లో జూలియా లార్డ్ టెన్నీసోన్ అనే రచయిత ఎస్టేట్ ను సందర్శించింది, అక్కడకి కుటుంబంతో వెళ్ళినప్పుడు ఒక ప్రాపర్టీ ని కొన్నారు. దానికి దీంబోలా లాడ్జి అని పేరుపెట్టుకున్నారు.

1863లో జూలియా కు 48 ఏళ్ళ వయసులో తన కూతురు ఆమెకు ఒక కెమెరాను బహుమతిగా ఇచ్చింది, అప్పటి నుండి ఫోటోగ్రఫీ మొదలుపెట్టింది జూలియా. ఒక్క సంవత్సరంలోనే లండన్ మరియు స్కాట్లాండ్ లలోని ఫోటోగ్రాఫర్స్ సొసైటీ లో సభ్యురాలు అయ్యింది. జూలియా మరణించే వరకు కూడా లండన్ ఫోటోగ్రఫీ సొసైటీ లో సబ్యురాలుగానే ఉంది.

19 century photography specialist2

జూలియా ఫోటోగ్రఫీలో ప్రముఖంగా ఉండేది అందమే. సరదాగా ప్రారంభించిన ఆమె 19 శతకంలోనే అత్యున్నత ఫోటోగ్రాఫర్ అని అనిపించుకున్నారు.

కామెరాన్ మేనల్లుడు జూలియా ప్రిన్సెప్ స్టీఫెన్ జూలియా బయో గ్రఫీ ని రాశారు, అది డిక్షనరీ అఫ్ నేషనల్ బయో గ్రఫీ లో మొదటి భాగంలో ఉంటుంది. 1948 వరకు జూలియా ఫొటోగ్రఫీ బాగా ప్రాచుర్యంలో ఉండేది, ఆతరువాత కూడా హెల్ముట్ జెర్న్ శెయ్మ్ జూలియా వర్క్ పై ఒక పుస్తకాన్నే రాశారు.

19 century photography specialist2

2003లో జె.పాల్ గెట్టి మ్యూసియం వారు జూలియా ఫోటోగ్రాఫ్స్ ను ప్రదర్శనలో పూర్తి కేటలాగ్ ను ఉంచారు. అప్పుడవి ఫోటోగ్రఫీలో ప్రామాణికంగా గుర్తించబడ్డాయి.

2013లో మెట్రోపాలిటన్ మ్యూసియం అఫ్ ఆర్ట్ వారు జూలియా ఫోటోగ్రఫీని ఎగ్జిబిషన్ లో ఉంచారు. 2015లో విక్టోరియా మరియు ఆల్బర్ట్ మ్యూసియం, లండన్ జూలియా ఫోటోగ్రఫీని వారి ఖర్చులతో 200వ వార్షికోత్సవాన్ని ఆమె ప్రయాణించిన సిడ్నీ, ఆస్ట్రేలియా లలో జరిపారు. మరో ఎగ్జిబిషన్ నేషనల్ పోర్ట్ రైట్ గేలరీ ఇన్ లండన్ లో మార్చ్ 2018లో ప్రదర్శించారు.

అప్పటిలోనే అంతటి ఘనత సాధించి, ఉత్సాహం ఉంటె వయసు కూడా విజయానికి అడ్డు కాదని…జూలియా జీవితం..ఎంతో మందికి ఆదర్శప్రాయం.