telugu navyamedia
క్రైమ్ వార్తలు

అమెరికాలో టెక్సాస్ పాఠశాలలో మారణహోమం..

అమెరికాలో విద్యార్ధుల‌పై దుండ‌గ‌డు కాల్పులు..
18 విద్యార్ధులు స‌హా 2క1 మంది మృతి..

అమెరికాలో మ‌రోసారి దారుణం జరిగింది. టెక్సాస్‌ లోని ఓ ఎలిమెంటరీ స్కూల్లోకి 18 ఏళ్ల యువకుడు తుపాకీతో ప్రవేశించి విచక్షిణారహితంగా కాల్పులు జరిపాడు. దుండగుడి కాల్పుల్లో 18 మంది పిల్లలు, ముగ్గురు టీచర్లు మరణించారు.
చనిపోయిన విద్యార్థుల వయసు 4 నుంచి 11 ఏళ్ల మధ్య ఉంటుందని టెక్సాస్ అధికారులు తెలిపారు.

ఈ ఘటన స్థానికంగా విషాదాన్ని మిగిల్చింది. పొద్దున్నే టాటా చెప్పి స్కూలుకు వెళ్లిన తమ చిన్నారులు ఇప్పుడు ఇలా విగతజీవులుగా పడి ఉండటం చూసి తల్లిదండ్రులకు నోటమాట రాలేదు.

మెక్సికో సరిహద్దులో ఉండే ఉవాల్డేలో అమెరికా కాలమానం ప్రకారం మంగళవారం ఉదయం 11.30 గంటలకు ఈ కాల్పులు చోటుచేసుకున్నాయి. సమాచారం అందిన వెంటనే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. దుండుగుడు స్కూల్‌లోనే ఉండడంతో అతడిని పట్టుకునేందుకు ప్రయత్నించారు.

కానీ పోలీసులపైకి కాల్పులు జరపరడంతో వారు కూడా ఎదురుకాల్పులు జరిపారు. ఎన్‌కౌంటర్‌లో ఆ ఉన్మాది కూడా మరణించాడు. ఇద్దరు పోలీసులకు గాయాలయ్యాయి.

విద్యార్థులపై కాల్పులకు పాల్పడిన నిందితుడు స్థానికుడైన సాల్వడోర్ రామోస్​గా పోలీసులు గుర్తించారు. మంగళవారం మధ్యాహ్నం ఓ యువకుడు.. రాబ్ ఎలిమెంటరీ స్కూల్ సమీపంలోకి కారులో వచ్చాడు. కారును కొద్దిదూరంలో వదిలేసి.. నడుచుకుంటూ లోపలికి వచ్చాడు. అనంతరం తరగతి గదుల్లోకి వెళ్లి పిల్లలపై కాల్పులు జరిపాడు.ఈ ఘటన జరిగిన స్కూల్‌లో మొత్తం 500 మంది విద్యార్థులు ఉన్నారు.

రామోస్​.. తన 18వ పుట్టినరోజున రెండు రైఫిల్స్​ను కొనుగోలు చేశాడని అధికారులు వెల్లడించారు. స్కూల్​పై కాల్పులకు ముందు అతడి నాయనమ్మను కూడా కాల్చిచంపినట్లు తెలిపారు. రాబ్​ ఎలిమెంటరీ స్కూల్లో మంగళవారం ఉదయం 11.30 గంటలకు (స్థానిక కాలమానం ప్రకారం) ఈ కాల్పులు ప్రారంభమయ్యాయి. దాదాపు ఒంటి గంట వరకు ఇవి కొనసాగాయి.

రామోస్​.. తన 18వ పుట్టినరోజున రెండు రైఫిల్స్​ను కొనుగోలు చేశాడని అధికారులు వెల్లడించారు. స్కూల్​పై కాల్పులకు ముందు అతడి నాయనమ్మను కూడా కాల్చిచంపినట్లు తెలిపారు.. 

సమాచారం అందిన నిమిషాల వ్యవధిలోనే పోలీసులు స్కూల్‌కి వెళ్లి.. దుండగుడిని మట్టుబెట్టారని.. లేదంటే మరింత పిల్లల ప్రాణాలు పోయేవని స్థానికులు చెబుతున్నారు. ఈ ఘటనలో టెక్సాస్ మొత్తం ఉలిక్కిపడింది. అమెరికాలో విషాద ఛాయలు అలుముకున్నాయి. రామోస్ అసలు స్కూల్‌లోకి చొరబడి ఎందుకు కాల్పులు కు పాల్పడడానికి వెనుక కారణాలు తెలియాల్సి ఉందని పేర్కొన్నారు.

కాగా.. ఘ‌ట‌న అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌కు ఈ ఘటన గురించి తెలుసుకుని దిగ్భ్రాంతి వ్య‌క్తం చేశారు..

Related posts