telugu navyamedia
రాజకీయ

ఝార్ఖండ్ సీఎం హేమంత్​ సోరెన్ ఇంట్లో కరోనా కలకలం..

దేశంలో క‌రోనా మ‌హమ్మారి విజృంభిస్తుంది. గతంలో ఎన్నడూ లేని విధంగా కేసుల సంఖ్య భారీగా పెరుతోంది. సామాన్యుల ద‌గ్గ‌ర నుంచి రాజకీయ నాయకులు, సెలబ్రిటీల వరకు అందరూ కరోనా బారిన పడుతున్నారు.

తాజాగా..ఝార్ఖండ్ సీఎం హేమంత్​ సోరెన్ ఇంట్లో కరోనా కలకలం రేపింది. సోరెన్ నివాసంలో మొత్తం 15 మందికి పరీక్షల్లో పాజిటివ్​గా తేలింది. వీరిలో సోరెన్ సతీమణి కల్పనా సోరెన్, ఆయన కుమారులు నితిన్, విశ్వజిత్​ల‌కు క‌రోనా నిర్ధరణ అయింది. వారంతా ఇంట్లోనే సెల్ఫ్ క్వారెంటైన్ అయినట్లు తెలిపారు.

कभी इंजीनियर बनना चाहते थे हेमंत सोरेन, अब बनेंगे झारखंड के CM - Education  AajTak

అయితే హేమంత్ సోరెన్​కు మాత్రం పరీక్షల్లో నెగెటివ్ వచ్చింది. సోరెన్​తోపాటు ఆయన మీడియా సలహాదారు, అసిస్టెంట్​కు కూడా నెగెటివ్​గా తేలింది.

ముఖ్యమంత్రి నివాసంలో ఇప్పటివరకు 62మందికి పరీక్షలు రాంచీ చీఫ్ మెడికల్ ఆఫీసర్ వినోద్ కుమార్ వెల్లడించారు. మరోవైపు ఝార్ఖండ్​లో కొత్తగా 5,081 మందికి వైరస్ నిర్ధరణ అయింది. మరో ముగ్గురు కొవిడ్​తో మృతి చెందారు.

Related posts