telugu navyamedia
క్రైమ్ వార్తలు

మాతా వైష్ణో‌దేవి ఆలయంలో తొక్కిసలాట -12మంది భక్తులు మృతి

జమ్మూ కాశ్మీర్‌లోని కొత్త సంవత్సరం రోజు తీవ్ర‌ విషాదం చోటుచేసుకుంది.  రియాసి జిల్లా కత్రాలోని మాతా మాతా  వైష్ణో‌దేవి ఆలయంలో తొక్కిసలాట జరిగింది. పూజల నిమిత్తం భక్తులు అధిక సంఖ్యలో భక్తులు పోటెత్తారు. శనివారం తెల్లవారుజామున తొక్కిసలాట జరిగింది.

ఈ ఘటనలో 12మంది భక్తులు మృతి చెందగా.. 26 మందికి గాయాలయ్యాయి. గాయపడిన వారిని మాతా వైష్ణో దేవి నారాయణ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్‌తో సహా ఇతర ఆసుపత్రుల్లో చేర్చారు. వారిలో పలువురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు స్థానికులు తెలిపారు. ఈ సంఘటన త్రికూట కొండలపై ఉన్న ఆలయ గర్భగుడి వెలుపల జరిగింది. మృతుల్లో ఢిల్లీ, హర్యానా, పంజాబ్‌, జమ్మూకశ్మీర్‌కు చెందిన వారు ఉన్నారని తెలిపారు.

మాతా 'వైష్ణోదేవి' ఆల‌యంలో తొక్కిస‌లాట - 12మంది మృతి - సంతాపం తెలిపిన 'మోడీ'  | Prabha News

ఈ ఘటనకు సంబంధించి పోలీసులు, స్థానిక అధికారులతో కలిసి సహాయక చర్యలు కొనసాగిస్తున్నారు. దేశవ్యాప్తంగా భక్తులు రావడం వల్ల సమాచారం హెల్ప్​లైన్​ను నంబర్​ను ఏర్పాటు చేసినట్లు ఆలయ బోర్డు తెలిపింది. ప్రమాదంపై ప్రధాని మోదీ, రాష్ట్రపతి రామ్​నాథ్​ కోవింద్​తో పాటు పలువురు ప్రముఖులు దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు.

Related posts