telugu navyamedia
తెలంగాణ వార్తలు వార్తలు

వర్షాలు కారణంగా జీహెచ్‌ఎంసీలోనే 11 మంది మృతి…

kcr stand on earlier warning to rtc employees

తెలంగాణలో మూడు రోజులుగా ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా చాలా నష్టం జరిగింది. ఇక రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు, వరదల వల్ల గురువారం ఈ రోజుకి 50 మంది మరణించారు. వారిలో జిహెచ్ఎంసి పరిధిలోనే11 మంది మరణించారు. జిహెచ్ఎంసిలో పరిధిలో 1916 తర్వాత ఒకేరోజు 31 సెంటీమీటర్ల వర్షపాతం నమోదు కావడం ఇదే ప్రథమం. అయితే చనిపోయిన వారి కుటుంబాలకు 5 లక్షల రూపాయల చొప్పున ఆర్థిక సహాయం అందించాలని నిర్ణయించినట్లు సీఎం కేసీఆర్ వెల్లడించారు. ఇండ్లు పూర్తిగా కూలిపోయిన వారికి కొత్త ఇండ్లు మంజూరు చేస్తామని, పాక్షికంగా దెబ్బతిన్న ఇండ్ల మరమ్మత్తులకు ఆర్థిక సాయం అందిస్తామని సీఎం చెప్పారు. నాలాలపై కట్టిన ఇండ్లు కూడా కూలిపోయాయని, వాటి స్థానంలో ప్రభుత్వ స్థలంలో కొత్త ఇండ్ల నిర్మాణం జరుపుతామని సిఎం స్పష్టం చేశారు. హైదరాబాద్ నగర పరిధిలో సహాయ కార్యక్రమాలు చేపట్టేందుకు తక్షణం జిహెచ్ఎంసికి 5 కోట్ల రూపాయలు విడుదల చేస్తున్నట్లు సీఎం కేసీఆర్ ప్రకటించారు.

Related posts