దేశవ్యాప్తంగా నిన్న కరోనా రెండో విడత ప్రారంభమైన విషయం తెలిసిందే. 60 ఏళ్ల పైబడిన వారికి, దీర్ఘకాలిక వ్యాధులున్న 45-59 ఏళ్ల మధ్య వయస్సు ఉన్న వారికీ కరోనా టీకా వేసే కార్యక్రమం సోమవారం ప్రారంభమైంది. ఇందులో భాగంగా రాష్ట్రంలో తొలిరోజు 4558 మందికి టీకా వేశారు. ఇందులో 100 ఏళ్ల వృద్ధుడు కూడా ఉండడం గమనార్హం. హైదరాబాద్‌కు చెందిన వ్యాపార వేత్త జయదేవ్ చౌదరి ఇక్కడి ఒక కార్పొరేట్ ఆస్పత్రిలో తన సమాచారాన్ని నమోదు చేసుకుని, తొలి టీకా పొందారు. టీకాలపై అపోహలు వీడి, అర్హులందరూ ముందుకు రావాలని ఆయన కోరారు. ఇక తెలంగాణలో 48 ప్రభుత్వ ఆస్పత్రుల్లో 2647 మందికి టీకాలను అందించాలని లక్ష్యంగా నిర్దేశించుకోగా.. 2005 మంది వేయించుకున్నారు. అటు ప్రైవేటు ఆస్పత్రులలో 4112 మందికి టీకా ఇవ్వాలని ప్రణాళిక రూపొందించగా.. వీరిలో 2553 మందికి అందించారు.
previous post