తిరుపతిలోని విద్యానగర్‌లో విషాదం చోటుచేసుకుంది. రాజ్యలక్ష్మీ అనే మహిళ నాలుగు రోజులు క్రితం మృతి చెందింది. అయితే తల్లి నిద్రపోతుందని భావించి..10ఏళ్ళ కుమారుడు నాలుగురోజులుగా తల్లి మృతదేహం వద్దే పడుకుంటున్నాడు. చివరికి మృతదేహం నుంచి దుర్వాసన రావడంతో మేనమామకు ఫోన్ చేయడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది.
వివరాల్లోకి వెళితే..
రాజ్యలక్ష్మి అనే మహిళ తిరుపతిలోని ఓ ప్రైవేటు కాలేజ్‌లో టీచర్‌గా పనిచేస్తుంది. ఆమెకు పదేళ్ల కొడుకు శ్యామ్ కిషోర్ ఉన్నాడు. కుటుంబ కలహాలతో గత కొంత కాలంగా రాజ్యలక్ష్మి భర్తకు దూరంగా ఉంటుంది.
ప్రస్తుతం కొడుకుతో కలిసి రాజ్యలక్ష్మి తిరుపతిలోని విద్యానగర్ కాలనీలో నివాసం ఉంటుంది. ఈ నెల 8వ తేదీన రాజ్యలక్ష్మి ఇంట్లో జారి పడడంతో రాజ్యలక్ష్మికి గాయాలయ్యాయి. కొంత నలతగా ఉండటంతో రెండు మూడు సార్లు వాంతులు చేసుకుంది.కొంతసేపు నిద్రిస్తానని, తనను లేపే ప్రయత్నం చేయద్దని ఆ తల్లి కుమారుడు శ్యామ్ కిషోర్ కి చెప్పింది.
అయితే రాజ్యలక్ష్మి మృతిచెందిందని తెలియని శ్యామ్ కిషోర్.. ఆమె నిద్రపోతుందని భావించారు. నాలుగు రోజులుగా స్కూల్‌కు వెళ్లి వస్తున్నాడు. ఇంట్లో ఉన్న ఆహారం, తినుబండరాలు తిన్నాడు. తల్లి పక్కనే పడుకునేవాడు.
అయితే శుక్రవారం సాయంత్రం మేనమాన దుర్గాప్రసాద్ ఫోన్ చేయడంతో ఇంట్లో దుర్వాస్తన వస్తుందని శ్యామ్ కిషోర్ చెప్పాడు. తల్లి నిద్రపోతుందని తెలిపాడు. దీంతో దుర్గాప్రసాద్ అక్కడికి వచ్చి చూడగా.. రాజ్యలక్ష్మి మృతదేహం కనిపించింది.
దీంతో దుర్గాప్రసాద్ వెంటనే పోలీసులకు సమాచారమిచ్చాడు. దీంతో అక్కడికి చేరుకున్న పోలీసులు.. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని రుయా ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.
రథం దగ్ధంపై చంద్రబాబు కమిటి..విజయసాయి విమర్శలు