telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్న “1917”… అవార్డు విన్నింగ్ మూవీ

1917

రిలయన్స్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌, ఆంబ్లిన్‌ పార్టనర్స్‌ సంస్థలు మొదటి ప్రపంచ యుద్ధం నేపథ్యంలో నిర్మించిన ‘1917’ చిత్రం ఇటీవల దేశవ్యాప్తంగా విడుదలైంది. సామ్‌ మెండెస్‌ (స్కై ఫాల్) ఫేమ్ దర్శకత్వంలో రూపొందిన ఈ వార్‌ ఎపిక్‌ డ్రామా ఎన్నో అవార్డులను గెలుచుకుంది. 92వ అకాడమీ అవార్డులకు 10 నామినేషన్లు పొందింది. అలాగే బఫ్తా అవార్డ్స్‌కు ఈ సంవత్సరం 9 నామినేషన్లను పొందింది. ఇవికా 77వ గోల్డెన్‌ గ్లోబ్‌ అవార్డుల్లో ‘1917’ ఉత్తమ చిత్రం అవార్డును గెలుచుకుంది. అలాగే దర్శకుడు సామ్‌ మెండెస్‌ ఉత్తమ దర్శకుడిగా అవార్డు గెలుచుకున్నారు. 25వ యాన్యువల్‌ క్రిటిక్స్‌ ఛాయిస్‌ అవార్డుల్లో ఉత్తమ దర్శకుడుగా సామ్‌ మెండెస్‌, ఉత్తమ సినిమాటోగ్రాఫర్‌గా రోజర్‌ డీకిన్స్‌, ఉత్తమ ఎడిటర్‌గా లీ స్మిత్‌ అవార్డులను పొందారు. ఈ చిత్రం అమెరికా, యు.కె.ల్లో కలెక్షన్ల పరంగా కొత్త రికార్డులు సృష్టించింది. ఈ రెండు దేశాల్లో ఓపెనింగ్‌ కలెక్షన్స్‌లో నెం.1గా నిలిచింది. అంతేకాకుండా ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాల్లో విడుదలైన ఈ సినిమా భారీ కలెక్షన్స్‌ రాబట్టింది. డ్రీమ్‌ వర్క్స్‌ పిక్చర్స్‌, రిలయన్స్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ సమర్పణలో న్యూ రిపబ్లిక్‌ పిక్చర్స్‌, నీల్‌ స్ట్రీట్‌ ప్రొడక్షన్‌.. మొగాంబో ఈ చిత్రాన్ని నిర్మించారు. జార్జ్‌ మెక్‌కే, డీన్‌ చార్లెస్‌ చాప్‌మేన్‌, కొలిన్‌ ఫెర్త్‌, బెనెడిక్ట్‌ కుంబర్‌బ్యాచ్‌ తదితరులు ఈ సినిమాలో ముఖ్యపాత్రలు పోషించారు. జనవరి 17న రిలయన్స్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ ద్వారా ఈ చిత్రం భారతదేశంలో విడుదలైంది. మొదటి ప్రపంచ యుద్ధం నేపథ్యంలో ‘1917’ చిత్రం భారత దేశంలోని ప్రముఖ దర్శకుల ప్రశంసలు అందుకుంది. వీరి కోసం ఇటీవల ఈ చిత్రాన్ని ప్రత్యేకంగా ప్రదర్శించారు. ఈ చిత్రాన్ని వీక్షించిన ప్రముఖ దర్శకుల్లో శ్రీరామ్‌ రాఘవన్‌, నితేష్‌ తివారి, విజయ్‌ కృష్ణ ఆచార్య, విక్రమాదిత్య మోత్వాని, శ్రీనారాయణ్‌ సింగ్‌ తదితరులు ఉన్నారు. ఈ చిత్రంపై దర్శక దిగ్గజాలు సైతం ప్రశంసల వర్షం కురిపిస్తున్నాయి.

Related posts