telugu navyamedia
ఆంధ్ర వార్తలు వార్తలు

వర్క్ ఫ్రం హోం కావాలని ప్రభుత్వానికి వినతి పత్రం ఇచ్చిన ఏపీ సచివాలయ ఉద్యోగులు

AP Secretariate

వర్క్ ఫ్రం హోం అవకాశం కల్పించాలని కోరుతూ ప్రభుత్వానికి సచివాలయ ఉద్యోగుల సంఘం వినతి పత్రం సమర్పించింది. అనంతరం మీడియాతో సచివాలయ సంఘం ప్రధాన కార్యదర్శి నాప ప్రసాద్ మాట్లాడుతూ… సచివాలయం ఉద్యోగులు నలుగురు చనిపోయారని, గతేడాది కోవిడ్ బారిన పడి ఇద్దరు ఉద్యోగులు చనిపోయారని ఈ మూడు రోజుల్లో నలుగురు చనిపోయారని అన్నారు. సచివాలయ ఉద్యోగులమైన మేమంతా భయపడుతున్నామన్న ఆయన 40-50 మంది ఉద్యోగులు హోం ఐసోలేషనులో ఉన్నారని అన్నారు. వర్క్ ఫ్రం హోంకు అవకాశం ఇవ్వాలని సీఎస్సును కోరామని అన్నారు. సచివాలయ సంఘం ప్రధాన కార్యదర్శి సుజాత మాట్లాడుతూ ఉద్యోగులమంతా భయాందోళనతో ఉన్నామని, కరోనా సెకండ్ వేవ్ దారుణంగా ఉందని అన్నారు. పద్మారావు అనే ఉద్యోగిని మూడు ఆస్పత్రులకు తీసుకెళ్లాల్సి వచ్చిందని, ఎటువంటి లక్షణాలు కన్పించకుండానే కోవిడ్ సోకుతోందని అన్నారు. వివిధ ప్రాంతాల వాళ్లు కూడా సచివాలయానికి వస్తారని మరో ఉద్యోగిని కోల్పోకుండా వర్క్ ఫ్రం హోం అవకాశం కల్పించాలని కోరారు. జాయింట్ సెక్రటరీ కోట రాజేష్ మాట్లాడుతూ కోవిడ్ మహమ్మారి వల్ల నలుగురు ఉద్యోగులను కొల్పోయామని వర్క్ ఫ్రం హోం అవకాశం ఉంటే కొంతవరకైనా కరోనా వ్యాప్తిని కట్టడి చేయవచ్చని అన్నారు.

Related posts