telugu navyamedia
రాజకీయ

బ్రిగేడియర్ ఎల్ఎస్ లిద్ద‌ర్ అంత్య‌క్రియ‌లు పూర్తి..

తమిళనాడులో జరిగిన హెలికాప్టర్ ప్రమాదంలో సిడిఎస్ బిపిన్ రావత్, ఆయన భార్య, బ్రిగేడియర్ LS లిద్దర్ సహా 13 మంది సైనికులను దేశం కోల్పోయింది. ఈ ప్రమాదంలో డియోరియా నివాసి గ్రూప్ కెప్టెన్ వరుణ్ సింగ్ మాత్రమే సజీవంగా ఉన్నాడు, అతను తీవ్రంగా గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు.

ఈ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన బ్రిగేడియర్ LS లిద్దర్ అంత్యక్రియలు నిర్వహించారు. ఢిల్లీ కాంట్‌లోని బెరార్ స్క్వేర్ శ్మశానవాటికలో అంతిమ అంతిమ సంస్కారాలు జ‌రిగాయి.

లిద్దర్ మృతదేహాన్ని వ‌ద్ద‌ ఆయన భార్య, కుమార్తె కన్నీరు ఆగడం లేదు. అయితే సైనికుడి భార్యగా, కూతురిగా బాధ్యతలు నిర్వర్తిస్తూనే, ఈ దుఃఖంలో ఒకరి చేయి ఒకరు పట్టుకుని నివాళులర్పించారు. లిద్దర్​ కమార్తె ఆశ్నా లిద్దర్.. బాధను దిగమింగుకుంటూ తండ్రికి నిప్పు పెట్టింది.

Last rites of Brigadier Lidder performed with full military honours

మ‌రో వైపు లిద్దర్​ అందరినీ ప్రేమించే వ్యక్తి అని, అందరితోనూ సంతోషంగా ఉండేవారని ఆయన భార్య గీతిక తెలిపారు. అందుకే ఆయన అంతిమ సంస్కారాలకు ప్రజలు తరలివచ్చారని పేర్కొన్నారు. ‘నేను ఓ జవాను భార్యను.. నా భర్తకు నవ్వుతూ వీడ్కోలు పలుకుతాను,’ అని ఆమె అన్నారు. ఆశ్నా.. తన తండ్రిని బాగా మిస్​ అవుతుందని, తమ జీవితాల్లో లిద్దర్​ లేకపోవడం తీరని లోటుగా మిగిలిపోతుందని భావోద్వేగంతో గీతిక చేప్పారు.

News updates from HT: Brigadier Lidder laid to rest with full state honour  and all the latest news | Latest News India - Hindustan Times

బ్రిగేడియర్ ఎస్ఎస్ లిడర్‌కు తుది వీడ్కోలు పలికేందుకు పలువురు ఉన్నతాధికారులు శ్మశానవాటికకు చేరుకున్నారు. రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, ఎన్‌ఎస్‌ఎ అజిత్ దోవల్, కేంద్ర మంత్రి , ఎన్‌డిఎలోని బ్రిగేడియర్ లిడర్ బ్యాచ్‌మేట్ రాజ్యవర్ధన్ సింగ్ రాథోడ్ కూడా అంత్యక్రియలకు హాజరయ్యారు.

Last rites of Brigadier Lidder performed with full military honours

Related posts