telugu navyamedia
క్రైమ్ వార్తలు విద్యా వార్తలు వ్యాపార వార్తలు

బైజూస్ సీఈవోపై ఈడీ కేసు నమోదు

బైజూస్ ఆన్‌లైన్ సంస్థ సీఈవో రవీంద్రన్‌పై ఈడీ అధికారులుకేసు నమోదు అయ్యింది. విదేశీ మారక ద్రవ్యం ఉల్లంఘనలపై రవీంద్రన్‌పై ఈడీ కేసు నమోదు చేసింది. శనివారం నాడు బెంగళూరులోని రవీంద్రన్ నివాసం, కార్యాలయాల్లో దాడులు చేపట్టినట్లు ఈడీ అధికారులు ఒక ప్రకటనను విడుదల చేశారు. బెంగళూర్‌లోని మూడు ప్రాంతాల్లో ఈ సోదాలు నిర్వహిస్తున్నట్లు ట్విట్టర్ ద్వారా ఈడీ కేంద్రకార్యాలయం వెల్లడించింది. ఈ దాడుల్లో ఇప్పటికే పలు కీలక డాక్యుమెంట్లను ఈడీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. డిజిటల్ డేటాను కూడా ఈడీ జప్తు చేసింది. విదేశీమారక ద్రవ్యం వ్యవహారంలో అవకతవకలకు పాల్పడినట్లు రవీంద్రన్‌పై ఈడీ కేసు నమోదు చేసింది. విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల కింద సుమారు రూ.28వేల కోట్లను బైజూస్ కంపెనీ పొందింది. అయితే దానికి సంబంధించిన లెక్కలను బైజూస్ ఇప్పటికీ బయటపెట్టని పరిస్థితి. ఈ వ్యవహారాన్ని సీరియస్‌గా తీసుకున్న ఈడీ ఈ మేరకు దాడులు నిర్వహించింది.

Related posts