telugu navyamedia
ట్రెండింగ్ రాజకీయ వార్తలు

బీజేపీ సుప్రీంకోర్టును తమ చేతుల్లో పెట్టుకుంది…

stalin dmk

ప్రస్తుతం మన దేశంలో 5 రాష్ట్రలో ఎన్నికలు జరుగుతుండగా అందులో తమిళనాడు కూడా ఒక్కటి. అయితే అక్కడ డీఎంకే నేతలు అన్నాడీఎంకేతో పాటు.. బీజేపీ, ప్రధాని నరేంద్ర మోడీపై హాట్ కామెంట్లు చేస్తోంది… ఇవాళ బీజేపీ, ప్రధాని నరేంద్ర మోడీపై సంచలన వ్యాఖ్యలు చేశారు డీఎంకే అధ్యక్షుడు స్టాలిన్.. బీజేపీ ప్రజాస్వామ్య బద్ధంగా ఎన్నికల్లో గెలవడం లేదని ఆరోపించిన ఆయన.. చాలాచోట్ల ఉన్న ప్రభుత్వాలను కూల్చి.. బీజేపీ అధికారంలోకి వచ్చిందని మండిపడ్డారు. ఇక, పార్లమెంటులో మెజారిటీ ఉండటంతో.. బీజేపీ.. అందరిని బెదిరించి.. బీసీఐ, ఎన్నికల సంఘం, ఐటీ, సుప్రీంకోర్టు తమ చేతుల్లో పెట్టుకుని.. ప్రభుత్వాలను నడుపుతున్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు. మరోవైపు ప్రధాని నరేంద్ర మోడీ క్రేజీ మొదట్లో ఉండేది.. కానీ, రానురాను అది తగ్గిపోయింది… పోతోందని అని కామెంట్ చేశారు. ఇక, సుప్రీంకోర్టుపై స్టాలిన్ చేసిన వ్యాఖ్యలపై అటార్నీ జనరల్‌ ఆఫ్ ఇండియాకు ఫిర్యాదు చేశారు చెన్నైకి చెందినా ఓ న్యాయవాది. చుడై మరి ఈ ఫిర్యాదు పై సుప్రీంకోర్టు ఎలా స్పందిస్తుంది అనేది.

Related posts