telugu navyamedia
క్రీడలు వార్తలు

నేను ఎలా ఆడాలనుకుంటోనో అలానే ఆడతా: సంజు

నిన్న వాంఖడే మైదానంలో చెన్నై సూపర్‌ కింగ్స్‌తో సోమవారం జరిగిన మ్యాచ్‌లో రాజస్థాన్‌ రాయల్స్‌ 45 పరుగుల తేడాతో ఘోర పరాజయం చవిచూసింది. సీఎస్‌కే తొలుత బ్యాటింగ్‌ చేసి 188 పరుగులు చేయగా.. రాజస్థాన్‌ 143 పరుగులకే పరిమితమైంది. అనంతరం రాజస్థాన్‌ రాయల్స్ సారథి సంజు శాంసన్ మీడియాతో మాట్లాడుతూ… ‘ఛేదించడానికి ఇది మంచి స్కోరని నేను అనుకున్నాను. కానీ మిడిల్ ఓవర్లలో చాలా వికెట్లు కోల్పోయాం. మా బౌలర్లు బాగా బౌలింగ్ చేశారు. అంతేకాదు బ్యాటింగ్ కూడా బాగా ఆడారు. అయితే 10-15 పరుగులు అదనంగా ఇచ్చాం. ఇదే మ్యాచ్ ఫలితంపై ప్రభావం చూపిందనుకుంటున్నా. మంచు ప్రభావం లేకున్నా బంతి బాగా టర్న్ అయింది. ఇది మేము అస్సలు ఊహించలేదు. ఈ ఫార్మాట్లో ఎప్పుడూ భారీ స్కోర్ అవసరం. నేను ఎప్పుడూ బేసిక్స్‌పై పని చేస్తూనే ఉంటాను. చేతన్ సకారియా బాగా రాణిస్తున్నాడు. మ్యాచ్‌లో ఓడిపోయినప్పటికీ చాలా పాజిటివ్‌లు ఉన్నాయి’ అని తెలిపాడు. 5 బంతుల్లో 1 పరుగు మాత్రమే చేసిన సంజు శాంసన్ కీలక సమయంలో పెవిలియన్‌ చేరాడు. సామ్‌ కరన్‌ వేసిన ఆరో ఓవర్‌ ఐదో బంతికి డ్వేన్ బ్రేవోకు క్యాచ్‌ ఇచ్చి ఔట్ అయ్యాడు.

Related posts