telugu navyamedia
ఆంధ్ర వార్తలు

తెలంగాణ హైకోర్టును ఆశ్రయించిన ఏపీ సీఎం జగన్‌

ఏపీ ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్ తెలంగాణ హైకోర్టును ఆశ్ర‌యించారు. సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్‌లో ఎన్నికల నియమావళి ఉల్లంఘించారన్న కేసు కొట్టివేయాలని హైకోర్టులో సీఎం జగన్ క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు.

2014 ఎన్నికల ప్రచారంలో నల్గొండ జిల్లా హుజూర్‌నగర్‌లో ఎన్నికల సమయంలో అనుమతి లేకుండా రోడ్ షో నిర్వహించారని జగన్ పై అభియోగాలు మోపుతూ అప్పట్లో పోలీసులు కేసు నమోదు చేశారు.

ఈ కేసుకు సంబంధించి విచారణకు హాజరుకావాలని ఇటీవల నాంపల్లి ప్రజాప్రతినిధుల కోర్టు జగన్ కు నోటీసులు జారీ చేసింది. దీంతో సీఎం జగన్ హైకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్‌ను తెలంగాణ హైకోర్టు విచారణకు స్వీకరించింది. సీఎం జగన్ హాజరుపై హైకోర్టు ఏప్రిల్‌ 26 వరకు స్టే విధించింది.

Related posts