telugu navyamedia
రాజకీయ

ఆధార్ లింక్ తప్పనిసరి.. సుప్రీం కోర్ట్ తాజా తీర్పు..

supreme court two children petition
భారతీయులందరికి ఒక్కటే గుర్తింపు కార్డు ఉండాలని ఆధార్ తెరపైకి తెచ్చారు. అయితే ఇప్పటికి అది అందరికి జారీచేయకపోవడం, దానిని ఇతర గుర్తింపు కార్డులతో అనుసంధానం చేసుకోవాలని మరో నియమం పెట్టడంతో పౌరులు చాలా ఇబ్బందులు పడ్డారు. ఈ ఇబ్బందులనుండి గట్టెక్కేందుకు కోర్టును ఆశ్రయించగా, ఆధార్ లింక్ తప్పనిసరి కాదని తీర్పు వెలువరించింది ఢిల్లీ కోర్టు. దీనిని సవాల్ చేస్తూ, కేంద్రం సుప్రీం కోర్టుకు వెళ్లగా.. లింక్ తప్పనిసరి అని తాజాగా తీర్పు వెలువరించింది కోర్టు. అంటే ఐటీ రిటర్న్స్ దాఖలు విషయంలో పాన్ కార్డు, ఆధార్ కార్డు లింకింగ్ తప్పనిసరి అంటూ సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఐటీ చట్టంలోని సెక్షన్ 139AA ను సర్వోన్నత న్యాయస్థానం సమర్థించింది. 
ఢిల్లీ తీర్పుపై సుప్రీంకోర్టు ధర్మాసనం స్పందిస్తూ.. పాన్, ఆధార్ లింకింగ్ సుప్రీంకోర్టులో పెండింగ్ లో ఉన్న సమయంలో హైకోర్టు అలా తీర్పు ఇచ్చిందని అభిప్రాయపడింది. అయితే ఐటీ చట్టంలోని సెక్షన్ 139AA ను సమర్థిస్తూ పాన్, ఆధార్ లింకింగ్ తప్పనిసరని సర్వోన్నత న్యాయస్థానం తీర్పునిచ్చింది. తాజా తీర్పుతో ఐటీ రిటర్న్స్ దాఖలుకు పాన్, ఆధార్ లింక్ తప్పనిసరిగా మారింది.

Related posts