telugu navyamedia
ఆంధ్ర వార్తలు

అమెరికాలో మళ్లీ హెచ్1బీ వీసా జారీ ప్రక్రియ

h1b visa - INDIA to USA
  • మార్చి 1 నుంచి దరఖాస్తులు, రిజిస్ట్రేషన్లకు మార్చి 18 ఆఖరు తేదీ.
  • లాటరీ పద్ధతిలో వీసాలకు ఎంపిక, దరఖాస్తు చేసుకున్నవారికి ర్యాండమ్ పద్ధతి
  • ఏటా 65 వేల హెచ్1బీ వీసాల జారీ, అత్యధికులు భారతీయులే ఉంటారు.
  • తాజాగా 2023 ఆర్థిక సంవత్సరం కోసం హెచ్1బీ వీసాల జారీ ప్రక్రియ ప్రారంభిస్తున్నట్టు అమెరికా ప్రభుత్వం ప్రకటించింది.
  • ఆన్ లైన్ లో myUSICS పోర్టల్ ద్వారా రిజిస్ట్రేషన్లు చేసుకోవాలని సూచించింది.
  • హెచ్1బీ వీసా తాత్కాలిక ప్రాతిపదికన ఇచ్చే వీసా. ఈ వీసాలతో అమెరికాలో అడుగుపెట్టేవారిలో అత్యధికులు భారతీయులే ఉంటారు.

వివిధ రంగాల నిపుణులు అమెరికాలో ఉపాధి పొందాలంటే హెచ్1బీ వీసా తప్పనిసరి. అమెరికా ప్రతి ఏడాది 65 వేల హెచ్1బీ వీసాలు జారీ చేస్తుంటుంది. మార్చి 1 నుంచి రిజిస్ట్రేషన్లు చేసుకోవచ్చని ఇమ్మిగ్రేషన్ విభాగం పేర్కొంది.

కాగా, రిజిస్ట్రేషన్ దరఖాస్తు సమయంలో 10 డాలర్ల రుసుం చెల్లించాలి. రిజిస్ట్రేషన్లకు మార్చి 18 ఆఖరు తేదీ. గడువులోపల దరఖాస్తు చేసుకున్నవారికి ర్యాండమ్ పద్ధతిలో హెచ్1బీ వీసాలు కేటాయిస్తారు. ఒకవిధంగా ఇది లాటరీ పద్ధతే. ఈ విడతలో వీసాలు పొందేవారు అక్టోబరు నుంచి అమెరికాలో ఉద్యోగంలో చేరే వెసులుబాటు ఉంటుంది.

Related posts