రాజస్థాన్ రాయల్స్‌పై రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు నమోదు చేసిన విజయం..ఈ సారి కప్ గెలిచి తీరాలనే బెంగళూరు జట్టును పట్టుదలకు నిదర్శనంగా నిలిచింది. అయితే రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు విజయాల్లో ఫాస్ట్ బౌలర్ మహ్మద్ సిరాజ్ కీ రోల్ పోషిస్తున్నాడు. గురువారం రాత్రి నాటి మ్యాచ్‌లో కూడా అతను మూడు వికెట్లను పడగొట్టాడు. అయితే ఈ సీజన్లో ఇప్పటిదాకా ఆడిన నాలుగు మ్యాచుల్లో మహ్మద్ సిరాజ్ అయిదు వికెట్లు తీసుకున్నాడు. సన్‌రైజర్స్ హైదరాబాద్‌పై రెండు వికెట్లు అతని ఖాతాలో ఉన్నాయి. వికెట్ల సంఖ్య తక్కువే అయినప్పటికీ- పొదుపుగా బౌలింగ్ చేశాడు. ఇప్పటిదాకా ఈ ఐపీఎల్ సీజన్లో 84 బంతులను ప్రత్యర్థి బ్యాట్స్మెన్లకు సంధించగా.. అందులో 50 డాట్ బాల్స్ ఉన్నాయి. ఈ 50 బంతులకు గాను ఒక్క పరుగు కూడా ఇవ్వలేదు సిరాజ్. ఇదో అరుదైన రికార్డు. ఈ సీజన్లో ఇప్పటిదాకా ఏ బౌలర్‌కు కూడా సాధ్యం కాలేదా ఫీట్. ఒక్క రన్ కూడా ఇవ్వకుండా 50 బంతులను విసిరిన తొలి బౌలర్‌గా తన పేరును లిఖించుకున్నాడు.