“ఖైదీ నెంబర్ 150″తో రీఎంట్రీ ఇచ్చిన మెగాస్టార్ చిరంజీవి… ఆ సినిమాతో భారీ హిట్ ను తన ఖాతాలో వేసుకుని తనకు ఇంకా ఏమాత్రం క్రేజ్ తగ్గలేదని నిరూపించుకున్నారు. ఇక ఆ సినిమా ఇచ్చిన జోష్ తో తన కలల ప్రాజెక్ట్ “సైరా”ను తనయుడు రామ్ చరణ్ నిర్మాతగా పట్టాలెక్కించాడు చిరు. ఈ సినిమా సురేందర్‌రెడ్డి దర్శకత్వంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా అమితాబ్, కిచ్చా సుదీప్, విజయ్ సేతుపతి, జగపతి బాబు, అనుష్క, తమన్నా, నయనతార లాంటి భారీ తారాగణంతో రూపొందించారు. దాదాపు 300 కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమాను అన్ని ప్రాంతీయ భాషలలో విడుదల చేస్తున్నారు. మెగా అభిమానులు ఈ సినిమాపై భారీ అంచనాలు పెట్టుకున్నారు. వివాదాల మధ్య ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ప్రపంచవ్యాప్తంగా సుమారు 4620 థియేటర్లలో సైరా విడుదలైంది. సైరా విడుదల నేపథ్యంలో ట్విట్టర్లో ఇప్పటికే పాజిటివ్ బజ్ క్రియేట్ అయింది. చిరు అభిమానులు బొమ్మ బ్లాక్ బస్టర్ అంటూ ట్విట్టర్‌ను హోరెత్తిస్తున్నారు. ఓవర్సీస్ రివ్యూలు కూడా పాజిటివ్‌గా ఉండటం.. చిరు నటన అద్భుతంగా ఉందన్న ప్రశంసలు వినిపిస్తుండటంతో.. సైరాటీం అంతా సంతోషంలో మునిగి తేలిపోతుంది. ఇక చిరంజీవి, రామ్ చరణ్ సంతోషానికి అవధులు లేవు. చరణ్‌ను ఎంతో అప్యాయంగా చిరంజీవి హత్తుకున్న ఫోటోలు, ముద్దు పెట్టుకున్న ఫోటోలు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి. ఇక సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉండే ఉపాసన… తన మామయ్య ‘సైరా’ సినిమా విడుదల సందర్బంగా కూడా కొన్ని ఆసక్తికరమైన ట్వీట్లు చేశారు. పశ్చిమగోదావరి జిల్లాలో ‘సైరా’ సినిమా విడుదలను చిరు అభిమానులు ఓ పండగలా చేసుకుంటున్నారు. భీమవరంలో సైరా సినిమా కోసం పెద్ద పోస్టర్ ఏర్పాటు చేశారు. 250 అడుగుల పొడవైన భారీ కటౌట్‌ను ఏర్పాటు చేశారు. దాదాపు అరకిలోమీటలర్ వరకు చిరంజీవి అభిమానులు సైరా కోసం అభిమానులు బ్యానర్ కట్టారు. అయితే ఈ బ్యానర్ వీడియోను తన సోషల్ మీడియా పేజ్‌లో ట్వీట్ చేస్తూ భీమవరం అభిమానులకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు ఉపాసన కొణిదెల.
Thank u for all the love #Bhimavaram #SyeRaaNarsimhaReddy #RamCharan pic.twitter.com/5wR3GNHr2E
— Upasana Konidela (@upasanakonidela) October 2, 2019