*సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ ఉదయ్ ఉమేష్ లలిత్ ప్రమాణం
*లలిత్ తో ప్రమాణం చేయించిన రాష్ర్టపతి ముర్ము
భారత ప్రధాన న్యాయమూర్తిగా సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఉదయ్ ఉమేష్ లలిత్ ప్రమాణం చేశారు. రాష్ట్రపతి భవన్ లో ద్రౌపది ముర్ము జస్టిస్ యు.యు. లలిత్‌తో శనివారం ఉదయం ప్రమాణం చేయించారు.
సుప్రీంకోర్టు 49వ ప్రధాన న్యాయమూర్తిగా ఉదయ్ ఉమేష్ లలిత్ బాధ్యతలు నిర్వర్తించనున్నారు. జస్టిస్ ఎన్‌వీ రమణ ఈ నెల 26 పదవీ విరమణ చేశారు.
జస్టియ్ యూయూ లలిత్ పదవీ కాలం నవంబర్ 8న ముగియనుంది. 74 రోజులు మాత్రమే ఆయన సీజేఐగా కొనసాగనున్నారు. తదుపరి సీజేఐగా జస్టిస్ డీవై చంద్రచూడ్ బాధ్యతలు చేపట్టే అవకాశం ఉంది.
రాష్ట్రపతి భవన్‌లో జరిగిన ఈ కార్యక్రమంలో ఉపరాష్ట్రపతి జగ్‌దీప్ ధన్‌ఖడ్, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, మాజీ సీజేఐ జస్టిస్ ఎన్‌వీ రమణ, మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్, మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు సహా పలువురు కేంద్రమంత్రులు, న్యాయమూర్తులు, న్యాయవాదులు పాల్గొన్నారు.
జస్టిస్ లలిత్ ప్రస్థానం ఇదే..
న్యాయవాదిగా జస్టిస్ లలిత్ ప్రస్థానం చూస్తే చాలా ఇన్‌స్పిరేటివ్‌గా ఉంటుంది. గ్రౌండ్ లెవల్ నుంచి ఎదిగొచ్చి… అత్యున్నత పీఠం అధిష్టించిన నేపథ్యం ఆయనది. ముంబై గవర్నమెంట్ లా కాలేజీ నుంచి గ్రాడ్యుయేట్ తీసుకున్న జస్టిస్ లలిత్.. 1983లో బాంబే, గోవాలో అడ్వొకేట్‌గా ఎన్‌రోల్ అయ్యారు. బాంబే హైకోర్టులో రెండేళ్లు ప్రాక్టీస్ చేశారు. 1986 జనవరిలో తన ప్రాక్టీస్‌ని ఢిల్లీకి మార్చారు. 2004లో సీనియర్ అడ్వొకేట్‌గా గుర్తించింది సుప్రీంకోర్టు. 2011లో 2జీ స్ప్రెక్టం కేసులో సీబీఐ తరపున వాదనలు వినిపించారాయన. 2014లో సుప్రీం కోర్టు న్యాయమూర్తిగా నియామకమయ్యారు. బార్ నుంచి నేరుగా సీజేఐగా నియమితులైన వ్యక్తుల్లో జస్టిస్ లలిత్ రెండో వారు.
న్యాయమూర్తిగా కూడా జస్టిస్ లలిత్‌కి ఘనమైన రికార్డే ఉంది. దేశంలో తీవ్ర సంచలనం సృష్టించిన ట్రిపుల్ తలాక్ సహా అనేక కీలక అంశాల్లో తీర్పు వెలువరించిన ధర్మాసనాల్లో జస్టిస్ యూయూ లలిత్ భాగస్వామిగా ఉన్నారు.. 2017లో విజయ్ మాల్యాకు నాలుగు నెలల జైలు శిక్ష విధించిన బెంచ్‌లో జస్టిస్ లలిత్ కూడా ఒకరు. ఇప్పుడు సీజేఐగా కూడా ఆయన అనేక కీలక కేసుల విచారణ చేపట్టబోతున్నారు. 490 పెండింగ్ కేసుల పరిష్కారం కోసం కొత్త ధర్మాసనాల్ని ఏర్పాటు చేసే ఆవకాశముంది.
నిరుద్యోగులపై కక్ష ఎందుకు.. జగన్ పై లోకేశ్ విమర్శలు