ప్రముఖ బాలీవుడ్ నటి ఉర్మిళా మంటోడ్కర్ ఇవాళ శివసేన పార్టీలో చేరనున్నారు. 2019 పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ తరఫున నార్త్ ముంబై స్థానం నుంచి పోటీ చేసి బీజేపీ అభ్యర్థిపై ఓటమి పాలయ్యారు ఉర్మిళా. 2019 మార్చిలో కాంగ్రెస్ సభ్యత్వం తీసుకున్న ఉర్మిళా అదే ఏడాది సెప్టెంబర్ లో పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు. ఆ సమయంలో కాంగ్రెస్‌లోని కొన్ని రాజకీయాల కారణంగానే తాను పార్టీకి దూరం అవుతున్నట్లు ప్రకటించారు. కాంగ్రెస్ లో పెద్ద లక్ష్యం కోసం పనిచేయడానికి బదులు అంతర్గత రాజకీయాలు, పార్టీలోని స్వార్థ ప్రయోజనాలతో పోరాటం చేయడం చాలా కష్టమంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ముంబైలో తన ఓటమికి పార్టీలోని కొన్ని వర్గాలు పనిచేశాయని తీవ్ర విమర్శలు చేసింది. కాంగ్రెస్‌పై తనకు భ్రమలు తొలిగిపోయాయని ఈ రంగీలా భామ వ్యాఖ్యానించడం అప్పట్లో సంచలనంగా మారింది. అప్పటి నుంచి రాజకీయాలకు దూరంగా వస్తున్న ఈ బాలీవుడ్ భామ ఇవాళ నుంచి కొత్తగా తన రాజకీయ ప్రయాణం ప్రారంభించనుంది. ఈ మేరకు శివసేన పార్టీలో చేరునుంది.
previous post
next post
చంద్రబాబు సెక్యూరిటీ పై స్పందించిన డీజీపీ