telugu navyamedia
క్రీడలు వార్తలు

వన్డే సిరీస్ కు ఇంగ్లాండ్ జట్టు ఎంపిక… కీలక ఆటగాడు దూరం

పుణే వేదికగా మంగళవారం(మార్చి 23) నుంచి భారత్, ఇంగ్లండ్ మధ్య మూడు వన్డేల సిరీస్ ప్రారంభంకానుండగా.. ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు వన్డే సిరీస్ కు జట్టును ప్రకటించింది. అయితే ఈ సిరీస్ కు ఇంతకముందే భారత్ కూడా జట్టును ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే ఇప్పటికే టెస్ట్, టీ20 సిరీస్ కోల్పోయిన ఆ జట్టు.. వన్డే సిరీస్‌కు స్టార్ పేసర్ జోఫ్రా ఆర్చర్ సేవలను కోల్పోయింది. మోచేతి గాయం కారణంగా అతను వన్డే సిరీస్‌కు దూరమవుతున్నాడని ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు ప్రకటించింది. మోచేతి గాయం చికిత్స కోసం ఆర్చర్ ఇంగ్లండ్ తిరుగుపయనమయ్యాడని, ఐపీఎల్ 2021 సీజన్ ఆరంభ మ్యాచ్‌లకు కూడా దూరమవుతాడని తెలిపింది. ఆర్చర్‌తో పాటు జోరూట్ కూడా వన్డే సిరీస్‌కు దూరమవుతాడని పేర్కొంది. ఆటగాళ్ల రొటేషన్ పాలసీలో భాగంగా జోరూట్‌కు మూడు వన్డేల సిరీస్ నుంచి విశ్రాంతి కల్పించినట్లు తెలిపింది.

ఇంగ్లాండ్ జట్టు : ఇయాన్ మోర్గాన్ (కెప్టెన్), మోయిన్ అలీ, జానీ బెయిర్ స్టో, సామ్ బిల్లింగ్స్, జోస్ బట్లర్, సామ్ కరన్, టామ్ కర్రన్, లియమ్ లివింగ్ స్టోన్, మాట్ పర్కిన్సన్, ఆదిల్ రషీద్, జాసన్ రాయ్, బెన్ స్టోక్స్, రీస్ టోప్లే, మార్క్ వుడ్

Related posts