వచ్చే ఏడాది జరిగే ఐపీఎల్ 15వ సీజన్ నుంచే మొత్తం 10 జట్లతో లీగ్‌ను ఆడించాలనే ఆలోచన చేసింది బీసీసీఐ. ఇందుకు సంబంధించి టెండర్లను కూడా పిలవాలనుకుంది. ఐపీఎల్‌ను ఎనిమిది జట్లతో కాకుండా 2022 నుంచి 10 జట్లతో నిర్వహిస్తామని ఈ ఏడాది ఆరంభంలో బోర్డు అధ్యక్షుడు గంగూలీ, కార్యదర్శి జై షా వెల్లడించారు. అలాగే 14వ సీజన్ ముగిశాక వీటి కోసం టెండర్లు పిలవాలని భావించారు. అయితే కొవిడ్ ధాటికి అంతా తారుమారైంది. మరోవైపు తాజాగా నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో వచ్చే ఏడాది జరగాల్సిన మెగా ఆటగాళ్ల వేలం కూడా ఉండకపోవచ్చని, ఈ ఏడాది జరిగిన మినీ వేలం లాంటిదే నిర్వహించవచ్చని అంచనా వేస్తున్నారు. ఇక ఐపీఎల్ సెకండాఫ్ నిర్వహణ కూడా కష్టంగా మారింది. మిగిలిన 31 మ్యాచ్‌ల నిర్వహణకు ఇంగ్లండ్, యూఏఈ, శ్రీలంక దేశాలు ముందుకు వచ్చినా క్రికెటర్లు ఆడటానికి సిద్దంగా లేరు. ఆయా దేశాల క్రికెట్ బోర్డులు తమ క్రికెటర్లు జాతీయ జట్టు కే ఆడతారని, ఐపీఎల్ ఆడబోరని తేల్చి చెబుతున్నాయి. అవసరమైతే టీ20 వరల్డ్‌కప్‌ను కాస్త వెనక్కు జరిపి ఐపీఎల్ నిర్వహించేందుకు బీసీసీఐ ప్రయత్నాలు చేస్తున్నది.
previous post