రెండో టెస్ట్ లో టీం ఇండియా కష్టాల్లో పడింది. మొదట ఇండియా పట్టుబిగించగా.. మూడో రోజు ఇంగ్లండ్ జట్టు విజృంభిస్తోంది. తొలి ఇన్నింగ్స్‌లో 329 పరుగులు చేసిన కోహ్లి సేన.. స్పిన్నర్ల మాయాజాలంతో రెండో రోజు ఆటలో ఇంగ్లండ్‌ను 134 పరుగులకే కట్టడి చేసింది. అయితే.. రెండో ఇన్నింగ్స్ బ్యాటింగ్ చేపట్టిన టీం ఇండియాకు ఆదిలోనే షాక్ తగిలింది. తొలి ఇన్నింగ్స్‌లో డకౌట్‌గా వెనుదిరిగిన ఓపెనర్ శుభ్‌మన్‌గిల్ 14 పరుగులు చేసి మరోసారి నిరాశపరిచాడు. ఇక రెండో రోజు ఆట ముగిసే సమయానికి టీం ఇండియా వికెట్ నష్టానికి 54 పరుగులు చేసింది. ఇక మూడో రోజు ఆట మొదలైన కాసేపటికే టీం ఇండియా భారీ ఎదురుదెబ్బ తగిలింది. మొయిన్ అలీ బౌలింగ్‌లో పుజారా 7 పరుగులకే రనౌట్ అయ్యాడు. అటు జాక్ లీచ్ ఓపెనర్ రోహిత్, గిల్, పంత్ వికెట్లను తీసి ఇండియాను దెబ్బతీశాడు. ప్రస్తుతం భారత్ స్కోరు 74-4గా ఉంది. ఇక ప్రస్తుతం కోహ్లీ, రహానే క్రీజులో ఉన్నారు.
previous post
next post
కేంద్రం ప్రకటించిన రైల్వే జోన్..మసిబూసిన మారేడుకాయ: చంద్రబాబు