తెలంగాణ పిసిసి నియామకం పై రాష్ట్ర కాంగ్రెస్ నేతలతో మరో విడత సంప్రదింపులు జరిపారు పార్టీ ఇంచార్జ్ ఠాగూర్. అయితే నిర్ణయం వాయుదా వేసుకోవాలని కోరారు తెలంగాణ నేతలు. రాష్ట్ర నేతలతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సంప్రదింపులు జరిపారు తెలంగాణ కాంగ్రెస్ ఇంచార్జ్ జనరల్ సెక్రటరీ మాణికమ్ ఠాగూర్. నాగార్జున సాగర్ ఉప ఎన్నిక వరకు పిసిసి నియామక నిర్ణయాన్ని వాయుదా వేసుకోవాలని కాంగ్రెస్ పార్టీ అధిష్ఠానానికి రెండు రోజుల క్రితం విజ్ఞప్తి చేసారు కె.జానారెడ్డి. సీనియర్ నాయకుడు కె. జానారెడ్డి విజ్ఞప్తి పై తెలంగాణ నేతలందరి అభిప్రాయాలను తెలుసుకోవాలని ఠాగూర్ ను ఆదేశించరు సోనియా గాంధీ. రేవంత్ రెడ్డి, మాజీ పిసిసి అధ్యక్షులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొన్నాల లక్ష్మయ్య, హనుమంతరావు, సి.ఎల్.పి నాయకుడు మల్లు భట్టి విక్రమార్క, మాజీ ఎమ్.పి మధు గౌడ్ తో సహా అందరూ ముక్త కంఠంతో నిర్ణయాన్ని వాయుదావేసుకోవాలని కోరినట్లు సమాచారం. విడిగా కాంగ్రెస్ ఎమ్.ఎల్.ఏలు, ఎమ్.ఎల్.సి ని సంప్రదించారు శాసన సభ పక్ష నాయకుడు భట్టి విక్రమార్క. నిర్ణయం వాయుదా వేసుకోవాలన్నదే అందరి అభిప్రాయం అన్నారు. తెలంగాణ నాయకుల అభిప్రాయాన్ని సోనియా గాంధీ కి తెలియజేసారు మాణికమ్ ఠాగూర్. నాగార్జున సాగర్ ఉప ఎన్నిక పై దృష్టి సారించారు ఠాగూర్. నాగార్జున సాగర్ ఉప ఎన్నికలో గెలిచి తీరాలనే పట్టుదలతో కాంగ్రెస్ పార్టీ ఉంది. త్వరలో రాష్ట్రానికి రానున్నారు మాణికమ్ ఠాగూర్. వరుస ఓటములతో నైరాశ్యంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ శ్రేణులను సమాయత్తం చేయనున్నారు ఠాగూర్.
previous post
next post