రాజకీయం లో తొలి అడుగు.

20

రాజకీయం నిత్యం మనం వింటూ చూస్తూ ఉండే పదం . ఇదొక పరమపద సోపానం గెలుస్తే వైకుంఠం ఓడితే పాతాళం . దమ్మున్నవాడు ,దైర్యం ఉన్నవాడు మాత్రమే ఆడే ఆట. అందుకే ఈ పదం లో అంత పవర్ ఉంది . అంతు చిక్కనిది ,అయోమయమైనది ,అసలు అర్థం కానిది ఈ రాజకీయం . మనకు తెలియకుండానే మనం రోజు దీనితో అనుసంధానం అవుతుంటాం. ఎంతో తెలివితేటలు ,ఎంతో చతురత ,మరెంతో సమయస్ఫూర్తి ,వీటన్నింటిని మించిన ఓర్పు ఇవ్వని ఉంటేనే రాజకీయంగా ఎదగగలం,నాయకుడిగా మారగలం ,రాజకీయాలు చేయగలం. చాణక్యుడు చెప్పాడు లేనిది సంపాదించడం ,సంపాదించింది నిలబెట్టుకోవడం,నిలబెట్టుకున్నది పెంపొందించుకోవడం.పెంపొందించుకున్నది వినియోగించుకోవడం ఇదే నిజమైన రాజకీయ తంత్రం అని .

నిజానికి యువత ఎదో చేయాలనీ ,ఏమో సాధించాలని ,ఇంకేదో పొందాలని రాజకీయాల్లోకి అడుగిడుతున్నారు . ఇంట్లో వారు వారించినా, సమాజం ఎగతాళి చేసిన రాజకీయాల్లోకి వస్తున్నారు . కానీ చాలా తక్కువ మంది ఇందులో నిలదొక్కుకుంటున్నారు . కారణం వారు ఊహించినంత సులువు కాదు ఈ రాజకీయం ,పరమపద సోపానంలో చిన్న పాములు ఉంటాయి వాటిని దాటితే పెద్ద పాములు ఉంటాయి .

ఎంతో ఆసక్తితో నాయకుడిగా ఎదగాలని ఒక యువకుడు ఒక పార్టీని ఎంచుకుని ఒక నాయకుడిని నమ్ముకుని రాజకీయాల్లోకి ఒక కార్యకర్తగా వస్తాడు . వచ్చిన వ్యక్తి ఎదో చేయాలనీ తపనతో ముందుకెళ్తుంటాడు పక్కనే ముందున్న ముసలి నాయకులకి ఇది నచ్చదు. కారణం రాజకీయం ఒక స్వార్థం . ముందుకెళ్లిన వాడు ఇంకా ఎంత ముందుకు వేళ్తాడో అని తమ ప్రాధాన్యత వీనివల్ల తగొచ్చు అని సొంత పార్టీ వాళ్ళు తన పైనే రాజకీయం ప్రారంభిస్తారు . ఏమి చేయాలో ఆ యువకుడికి తోచకుండా చేస్తారు . ఇలా మనవాళ్ళు అనుకున్న వాళ్ళు మనన్నే మోసగించడం ,మనవాళ్ళు మనన్నే క్రిందకు లాగడం రాజకీయం .

అయితే వీటన్నింటిని తట్టుకొని ముందుకుపోవడం అది అసలైన రాజకీయం . ఎన్నో ఉలి దెబ్బలు తింటే శిల శిల్పం అవుతుందో, ఎన్నో అనుభవాలు అయితే తప్ప సామాన్యుడు రాజకీయ నాయకుడు కాలేదు .ఆశించే స్థాయి నుండి శాశించే స్థాయికి ఎదగడమే రాజకీయం. ఎన్నో చెడులను ఎదురించి వచ్చి నిలబడే నాయకుడు మాత్రమే దేశానికి మంచి చేయగలడు ,దేశం కోసం నేను అనే స్వార్థం నీలో ఉంటే నీవే రేపటి గొప్ప నాయకుడివి కావచ్చు .

అందుకే ఓ యువత లే ,లేచినిలబడు ,నిన్ను నువ్వు నిలదొక్కుకో ,దేశాన్ని మంచి నాయకత్వంలో నిలబెట్టు ,రాజకీయం రణరంగం అనేవాళ్లకు రాజకీయం ఒక రాజ మార్గమని నిరూపించు. ఈ ప్రపంచంలో నీకు నువ్వే సాటి,నీకు నువ్వే పోటీ,నీకు నువ్వే మేటి. ఇలా ఎదిగినవారికి రాజకీయం నిజంగా స్పెషలే