ఈ జనవరిలో క్రాక్ సినిమాతో సూపర్ హిట్ అందుకున్న రవితేజ తాజాగా మరో సినిమాని ప్రకటించాడు. త్రినాథరావు నక్కిన దర్శకత్వంలో రవితేజ 68వ సినిమా అఫీషియల్ గా అనౌన్స్ చేశారు. ఈ సినిమాని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ పతాకాలపై టి.జి. విశ్వప్రసాద్, అభిషేక్, వివేక్ కూచిభోట్ల నిర్మించనున్నారు. కుమార్ బెజవాడ దీనికి కథ, స్క్రీన్ప్లే అందిస్తున్నారు. ఇదిలా ఉంటే రవితేజ ప్రస్తుతం రమేష్ వర్మ దర్శకత్వంలో మరో మాస్ మసాలా సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాకి ఖిలాడీ పేరును ఖరారు చేశారు. ఈ సినిమాని నిర్మాత సత్యనారాయణ కోనేరు నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో మీనాక్షి చౌదరి, డింపుల్ హయాతి హీరోయిన్లుగా చేస్తున్నారు. అయితే ఇప్పటివరకు దీనికి సంబంధించిన ఫస్ట్ లుక్, గ్లింప్స్ వీడియోలు విడుదలై ఆకట్టుకుంటున్నాయి. మే 28న ఈ సినిమా విడుదల కానుంది అయితే రవితేజ క్రాక్ సినిమాతో తన కెరీర్లోనే బిగ్గెస్ట్ హిట్ అందుకున్నాడు. ఈ సినిమా ముందువరకు సినిమాకి రూ.10-12 కోట్లు తీసుకునే వాడట. తాజాగా రవితేజ తన కొత్త సినిమాకి రూ.15కోట్లు డిమాండ్ చేస్తున్నాడని వార్తలు హల్చల్ చేస్తున్నాయి. చూడాలి మరి ఏం జరుగుతుంది అనేది.
previous post
next post