telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

యూపీ సీఎంని కలిసిన అక్షయ్‌ కుమార్‌.. కారణమిదే

బాలీవుడ్‌ స్టార్‌ హీరో అక్షయ్‌ కుమార్‌ యూపీ సీఎం యోగి ఆదిత్య నాథ్‌ను కలిశారు. ముంబైకి వచ్చిన సీఎం యోగిని.. ట్రైడెంట్‌ హోటల్‌లో నిన్న రాత్రి అక్షయ్‌ భేటీ అయ్యారు. అయితే.. ఆ ఇద్దరూ రామసేతు సినిమా గురించి చర్చించినట్లు తెలుస్తోంది. రామ సేతు సినిమాను అభిషేక్‌ శర్మ డైరెక్ట్‌ చేస్తున్నారు. రామ సేతు బ్రిడ్జ్‌కు సంబంధించిన కథాంశంతో సినిమాను రూపొందిస్తున్నారు. అయితే.. సీఎం యోగి బుధవారం పలువురు బాలీవుడ్‌ నిర్మాతలను కలవనున్నట్లు తెలుస్తోంది. బాలీవుడ్‌ ప్రొడ్యూసర్‌ రాహుల్‌ మిత్రా ఈ విషయాన్ని ప్రకటించారు. యూపీలో ఫిల్మ్‌ సిటీని ఏర్పాటు చేయాలనుకుంటున్న అంశంపై బాలీవుడ్‌ నిర్మాతలతో యోగి చర్చించే అవకాశాలు ఉన్నాయి. నోయిడాలో ఫిల్మ్ సిటీని ఏర్పాటు చేయాలనుకుంటున్నట్లు గత సెప్టెంబర్‌లో సీఎం యోగి ఓ ప్రణాళికను రిలీజ్‌ చేశారు. బాలీవుడ్‌ మేటి నిర్మాతలు సుభాష్‌ ఘాయ్‌, బోనీ కపూర్‌, రాజ్‌కుమార్‌ సంతోషి, సుధీర్‌ మిశ్రా, రమేశ్‌ సిప్పి లాంటి వారు సీఎం యోగి తో భేటీ కానున్నారు. ఇవాళ ఉదయం బాంబే స్టాక్ ఎక్స్‌చేంజ్‌ వెళ్లిన యూపీ సీఎం యోగి… అక్కడ లక్నో మున్సిపల్‌ కార్పొరేషన్‌ బాండ్లను లిస్టింగ్‌ చేసిన సందర్భంగా గంట కొట్టారు.

Related posts