మెగా హీరో సాయి ధరమ్ తేజ్ గత నెల 10న దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జ్ బ్రిడ్జి మీద నుంచి ఐకియా స్టోర్ వైపు వెళుతోన్న సమయంలో బైక్ స్కిడ్ అయి తేజ్‌కు తీవ్ర గాయాలయ్యాయి.
ఈ క్రమంలోనే అటుగా వెళ్తున్న ఓ వ్యక్తి స్థానికుల సహాయంతో తేజ్‌ను వెంటనే దగ్గర్లోని ఆసుపత్రికి తరలించడంతో పెద్ద ప్రమాదం తప్పింది. అయితే అనంతరం అపోలో హాస్పిటల్లో సుమారు నెలరోజుల పాటు చికిత్స తీసుకున్న తేజ్ డిశ్చార్చ్ అయ్యారు. అప్పటి నుంచి ఇంటిదగ్గరే ఉంటూ ప్రత్యేక డైట్ తీసుకుంటున్నారు.
ఇప్పుడు ఆయన ఆరోగ్యంపై ఓ ప్రత్యేక అప్డేట్ వచ్చింది… సాయి ధరమ్ తేజ్ పూర్తిగా కోలుకున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం గాయాల తాలుకు నొప్పులు తగ్గేందుకు గాను ఫిజియో థెరపీ, స్పీచ్ థెరపీ చికిత్స తీసుకుంటున్నట్లు తెలుస్తోంది.
మరికొన్ని రోజుల్లోనే సాయి ధరమ్ ఓ థ్రిల్లర్ సినిమాలో నటించబోతున్నారు. కొత్త దర్శకుడు కార్తిక్ దండు డైరెక్షన్ చేస్తుండగా.. సుకుమార్ స్ర్కీన్ ప్లే అందిస్తున్న ఈ సినిమాను బీ.వీ.యస్.యన్ ప్రసాద్ నిర్మిస్తున్నారు. ఇంకా ఈ మూవీ టైటిల్ ఖాయం చేయలేదు.