బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్‌కుమార్ తాజాగా మెట్రోలో ప్రయాణిస్తూ సోషల్ మీడియాలో ఓ వీడియోను షేర్ చేశారు. అందులో రెండు గంటల ప్రయాణాన్ని కేవలం 20 నిముషాల్లో పూర్తి చేయడం ఎంతో ఆనందంగా ఉందని అక్షయ్ తెలిపారు. ఈ వీడియోలో ఉన్నదాని ప్రకారం… అక్షయ్ ముంబైలోని ఘాటాకోపర్‌లో జరుగుతున్న షూటింగ్‌లో పాల్గొన్నారు. అక్కడి నుంచి అక్షయ్ వెర్సోవా వెళ్లాల్సివుంది. ఇందుకోసం అతను గూగుల్ మ్యాప్‌లో ట్రాఫిక్ చెక్ చేశారు. గమ్యం చేరేందుకు 2 గంటల సమయం పట్టవచ్చని తెలిసింది. దీంతో ‘గుడ్ న్యూస్’ డైరెక్టర్ రాజ్… అక్షయ్‌కు ‘మెట్రో’లో ప్రయాణించవచ్చనే సలహా ఇచ్చారు. అయితే ‘మెట్రో’లో ప్రయాణించేందుకు మొదట ఆసక్తి చూపని అక్షయ్ తరువాత దానిలో ప్రయాణించేందుకు సిద్ధమయ్యారు. ఇద్దరు బాడీగార్డుల సహాయంతో ‘మెట్రో’ ఎక్కి, సైలెంట్‌గా ఒక మూలన కూర్చున్నారు. దీంతో అభిమానులెవరూ ఆయనను గుర్తుపట్టలేకపోయారు. కాగా ఆ సమయంలో వర్షం కూడా పడుతోంది. వర్షంలో ‘మెట్రో’ ప్రయాణాన్ని అక్షయ్ ఎంతో ఎంజాయ్ చేస్తూ కనిపించారు. సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్న ఈ వీడియోను మీరు కూడా వీక్షించండి.
previous post
ఎన్టీఆర్ చాలా మారిపోయాడు… శ్రియ కామెంట్స్