కాంగ్రెస్ సీనియర్ నాయకులు జైపాల్ రెడ్డి భౌతికకాయానికి అంతిమ సంస్కారాలు ఈ రోజు హైదరాబాద్ లో ముగిశాయి. నెక్లెస్ రోడ్ పీవీ ఘాట్ సమీపంలో ప్రభుత్వ అధికార లాంఛనాలతో జైపాల్ రెడ్డి అంత్యక్రియలు నిర్వహించారు. అంతిమ సంస్కారాలను జైపాల్ రెడ్డి పెద్ద కుమారుడు అరవింద్ రెడ్డి నిర్వహించారు. జైపాల్ రెడ్డికి కడసారి వీడ్కోలు పలికేందుకు పార్టీలకు అతీతంగా నాయకులు తరలివచ్చారు.
ఈ కార్యక్రమానికి మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, టీఆర్ఎస్ రాజ్యసభ సభ్యులు ఎంపీ కేశవరావు, కాంగ్రెస్ సీనియర్ నాయకులు గులాం నబీ ఆజాద్, మల్లిఖార్జున్ ఖర్గే, కర్ణాటక మాజీ సీఎం సిద్ధరామయ్య, కర్ణాటక మాజీ స్పీకర్ రమేశ్ కుమార్, జేసీ దివాకర్ రెడ్డి, డీకే అరుణ, చిన్నా రెడ్డి, డి. శ్రీనివాస్, ఎంపీ రేవంత్ రెడ్డి, జానారెడ్డి, ఎమ్మెల్యే హరీష్రావు, గుత్తా సుఖేందర్ రెడ్డి, నన్నపనేని రాజకుమారి, పలువురు టీఆర్ఎస్, కాంగ్రెస్ ఎమ్మెల్యేలతో పాటు పలువురు ప్రముఖులు హాజరయ్యారు.
జైల్లో ఉన్నవారు 90 శాతం బీదవారే: వీకే సింగ్