మా అధ్యక్షుడు మంచు విష్ణుతో నిర్మాత దిల్ రాజు సమావేశమయ్యారు. ఈ సమావేశంలో కీలక విషయాలపై చర్చ జరిగిందని తెలుస్తోంది.
ఈ మధ్యకాలంలో తెలుగు చిత్రసీమలో నెలకొంటున్న పరిస్థితులు జనాల్లో హాట్ టాపిక్ అవుతున్నాయి. ప్రొడక్షన్ కాస్ట్ పెరుగుతుండటం ఓ వైపు, థియేటర్లకు ఓటీటీ వేదికలు గట్టి పోటీ ఇస్తుండటం మరోవైపు.. ఇలాంటి పరిస్థితుల నడుమ టాలీవుడ్ వర్గాల్లో ఎన్నో ఇష్యూస్ తెరపైకి వస్తున్నాయి.
ఈ సందర్భంగా షూటింగ్స్ బంద్పై, ఆర్టిస్టుల రెమ్యూనరేషన్, మా సభ్యులకు సినిమా అవకాశాలపై వీరు ముచ్చటించినట్లు తెలుస్తోంది. ఈ మేరకు ఫొటోను షేర్ చేస్తూ మంచు విష్ణు ట్వీట్ చేశారు.
ఈ సందర్భంగా తమ సినిమాల్లో ‘మా’ సభ్యులకు ఎక్కువగా అవకాశాలు ఇవ్వాలని, అలాగే కొత్తవారు ‘మా’ సభ్యత్వం పొందేలా ప్రోత్సహించాలని దిల్ రాజును కోరినట్లు విష్ణు తెలిపారు. ఈ మేరకు మా సంక్షేమ కమిటి వినతి పత్రాన్ని దిల్ రాజుకు అందించారు.
కాగా ‘మా’ సభ్యులకు సినిమా అవకాశాలు కల్పించాలని కోరుతూ విష్ణు ఇకపై పలువురు టాలీవుడ్ నిర్మాతలను కలవనున్నారట. ఈ నేపథ్యంలోనే ఆయన దిల్ రాజుతో భేటి అయినట్లు సమాచారం.
ఈ మీటింగ్కు మా నుంచి ప్రస్తుత అధ్యక్షుడు మంచు విష్ణు , జీవితా రాజశేఖర్, రఘు బాబు, శివ బాలాజీ తదితరులు సమావేశం అయ్యారు. గిల్డ్ నుంచి ప్రముఖ నిర్మాత ‘దిల్’ రాజు, దామోదర్ ప్రసాద్, సితార ఎంటర్టైన్మెంట్స్ అధినేత సూర్యదేవర నాగవంశీ, భోగవల్లి బాపినీడు, ‘మైత్రీ మూవీ మేకర్స్’ అధినేతలలో ఒకరైన యలమంచిలి రవిశంకర్, ‘పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ’ నుంచి వివేక్ కూచిభొట్ల తదితరులు హాజరయ్యారు.