పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ “వకీల్ సాబ్’ షూటింగ్ పూర్తి అయింది. పవన్ కళ్యాణ్ తన రీ ఎంట్రీ కూడా ఇదే సినిమాతో ఇవ్వనున్నాడు. దిల్ రాజు నిర్మాత వేణు శ్రీరామ్ దర్శకత్వంలో రాబోతున్న ఈ సినిమాపై మంచి అంచనాలే ఉన్నాయి. ఈ సినిమాను హిందీ మూవీ పింక్‌కు రీమేక్‌గా తెరకెక్కిస్తున్నారు. ఇందులో పవన్ కళ్యాణ్ లాయర్ గెటప్‌లో కనిపించనున్నాడు. ఇప్పటికే ఈ సినిమా టీజర్‌ను రిలీజ్ చేసింది చిత్ర బృందం. ఆ టీజర్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. అయితే.. తాజాగా వకీల్‌సాబ్ మూవీ నుంచి మరో అప్డేట్ వచ్చేసింది. ఈ చిత్రంలో అంజలి, నివేథా థామస్, అనన్య ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. కానీ ఇప్పటివరకు వారి హురించి ఎటువంటి పోస్టర్ రాలేదు. అయితే ఈరోజు మహిళా దినోత్సవం సందర్బంగా ఈ సినిమా నుండి ఆ ముగ్గురికి సంధించిన ఓ పోస్టర్ ను చిత్రబృందం విడుదల చేసింది. అయితే ఈ ఏడాది ఏప్రిల్ 9న ఈ సినిమాను థియేటర్లలో వరల్డ్ వైడ్‌గా రిలీజ్ చేయనున్నారు. ఈ సినిమా తర్వాత ప్రస్తుతం పవన్ మలయాళ హిట్ చిత్రం ‘అయ్యప్పనుమ్ కోషియుమ్’ తెలుగు రీమేక్ చేస్తున్న విషయం తెలిసిందే.
previous post
next post